అత్యధిక పోషక విలువలు కలిగిన బంగారం లాంటి అరటి పండును ‘క్వీన్‌లాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ’కి చెందిన ఆస్ట్రేలియా పోలీసు తయారు చేశారు.

సిడ్నీ: అత్యధిక పోషక విలువలు కలిగిన బంగారం లాంటి అరటి పండును ‘క్వీన్‌లాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ’కి చెందిన ఆస్ట్రేలియా పోలీసు తయారు చేశారు. ఈ పండులో పల గుజ్జు కొంచెం బంగారు రంగులోనూ, కొంచెం నారింజ పండు రంగులోనూ ఉంటుంది. అందుకనే దీనికి గోల్డెన్ బనానాస్ అని పిలుస్తున్నారు. ఉగాండాలో పౌష్టికాహార లోపంతో ఏటా ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల మంది పిల్లలు మరణిస్తుండడంతో వారికి పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త రకం అరటి పండును సష్టించారు.
