జగడాలమారి ఉత్తర కొరియా తన తీరు మార్చుకోదట. తమ దేశ అణు కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉత్తర కొరియా సైనికాధికారులు మరోసారి స్పష్టం చేశారు.
ప్యాంగ్యాంగ్: జగడాలమారి ఉత్తర కొరియా తన తీరు మార్చుకోదట. తమ దేశ అణు కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉత్తర కొరియా సైనికాధికారులు మరోసారి స్పష్టం చేశారు. అయితే, తమ సైనిక సంపత్తిని ఉన్నతీకరించే చర్యల్లోభాగంగా అణుకార్యక్రమాలు ఉంటాయి తప్ప ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఉద్దేశం మాత్రం కాదని చెప్పాయి. ఏ దేశం తమ దేశంపై దాడి చేయనంత వరకు ఎలాంటి అణ్వాయుధాలు ఉపయోగించబోమని చెప్పింది.
ప్రపంచ అణ్వాయుధాల కార్యక్రమాల నిబంధనలకు అనుగుణంగా తమవంతు బాధ్యతను పంచుకుంటూనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఉత్తర కొరియా అధికార పార్టీకి చెందిన అధికార ప్రతినిధి రోడాంగ్ సిమ్నం తెలిపారు. గత మే నెలలో పార్టీ 7వ సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ ఆర్థిక పురోభివృద్ధితోపాటు అణ్వాయుధాల సంపత్తి విషయంలో కూడా దేశం దూసుకెళ్లాలని ప్రసంగించిన విషయం తెలిసిందే.