20 రోజుల తర్వాత కనిపించిన కిమ్

ప్యాంగ్‌యాంగ్ : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ 20రోజుల తర్వాత కనిపించారు. కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగార నిర్మాణం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నట్టు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కిమ్‌తోపాటూ అతని సోదరి కిమ్ యో జోంగ్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 15 నుంచి కిమ్ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చజరిగింది. ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి