అమెరికానే రెచ్చగొడుతోంది:ఉత్తరకొరియా | North Korea accuses US soldiers of provoking border troops | Sakshi
Sakshi News home page

అమెరికానే రెచ్చగొడుతోంది: ఉత్తరకొరియా

Apr 29 2016 7:07 PM | Updated on Apr 4 2019 5:04 PM

అమెరికా దక్షిణకొరియాతో కలిసి సరిహద్దుల్లో తమ సైనికుల మీదకు దక్షిణ కొరియా సైనికులతో తమ వైపు తుపాకులను గురిపెట్టిస్తోందటూ ఉత్తరకొరియా ఆరోపించింది.

సియోల్: అమెరికా తమ వైరిదేశం దక్షిణకొరియాతో కలిసి  సరిహద్దుల్లోని తమ సైనికుల మీదకు తుపాకులను గురి పెట్టిస్తోందంటూ ఉత్తరకొరియా ఆరోపించింది. యూఎస్ సైనికులు దుశ్చర్యలను మానుకోకపోతే మూల్యం చెల్లించుకుంటారని ఉత్తరకొరియా సైన్యం  హెచ్చరించింది. గతవారం అమెరికా జీఐలు సమాయత్తం చేసుకున్న ఆయుధాలతో సౌత్ కొరియన్ల ద్వారా ప్రమాదకరమైన హెచ్చరికలు చేసినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించింది.

ఉత్తరకొరియా సైనికుల వైపుకు వేళ్లు చూపుతూ గద్గద స్వరాలను వినిపించారని, ముఖ కవళికల్లో అసహ్యంగా ప్రవర్తించారని వివరించింది. 2006లో ఉత్తరకొరియా తొలి న్యూక్లియర్ ప్రయోగం చేసినప్పటి నుంచి అమెరికా తరచుగా సరిహద్దుల్లో హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది. దీనికి దీటుగానే సమాధానం ఇస్తూ వస్తున్న రాజరికపు దేశం బోర్డర్లలోని సైనికులను అప్పుడప్పుడూ రెచ్చగొడుతూ వస్తోంది.

తాజాగా చేసిన ఆరోపణలు ఉత్తరకొరియా చేపట్టిన రెండు మీడియం రేంజ్ క్షిపణ ప్రయోగాలు విఫలం అయినట్లు దక్షిణ కొరియా, అమెరికాలు ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది దక్షిణ కొరియా, అమెరికాలు చేపట్టే కవాతుకు వ్యతిరేకంగా ఉత్తరకొరియా వరుస ప్రయోగాలు చేస్తోంది.

1950-53 మధ్య జరిగిన యుద్ధానంతరం మొదలైన ఉత్తర, దక్షిణ కొరియాల వైరం ఇప్పటికే చల్లారకుండానే మిగిలేవుంది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత శాంతి ఒప్పందం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రెండు దేశాల మధ్య సైనికులను నాలుగు కిలో మీటర్ల దూరం(పన్ మున్జోమ్) ప్రాంతంలో మొహరించకుండా ఉండేట్లు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు పాల్పడుతుండటంతో అమెరికా దాదాపు 28,000 మంది సైనికులను దక్షిణకొరియా సరిహద్దుల్లో మొహరించింది. అయితే, ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement