రన్‌ వేపై విమానాలు ఢీ | No one injured after 2 airplanes at Pearson clip wings | Sakshi
Sakshi News home page

రన్‌ వేపై విమానాలు ఢీ

Aug 7 2017 9:01 PM | Updated on Sep 17 2017 5:16 PM

రన్‌ వేపై విమానాలు ఢీ

రన్‌ వేపై విమానాలు ఢీ

ఒకే రన్‌ వే మీదకు వచ్చిన రెండు విమానాలు ఢీకొన్నాయి.

టొరంటో: ఒకే రన్‌ వే మీదకు వచ్చిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానాల రెక్కలు ఒకదానికొకటి తగిలి పూర్తిగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరూ ప్రమాదంలో గాయపడలేదు. టొరంటో విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనపై టొరంటో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

పోలాండ్‌కు చెందిన బోయింగ్‌ 787 విమానం రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. అదే సమయంలో కెనడాకు చెందిన ఎయిర్‌ కెనడా విమానం రన్‌ వేపై దిగింది. ఈ సమయంలో రెండు విమానాల రెక్కలు ఢీ కొన్నాయి. ఇరు విమానాలు భారీగా దెబ్బతిన్నాయి. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఒక్కో విమానంలో 200కుపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement