స్వీడన్‌ ప్రధాని సలహాదారుగా మరాఠా యువతి

Nila Vikhe Patil Named Sweden Prime Ministers Advisor - Sakshi

స్టాక్‌హోం : భారత సంతతికి చెంది న యువతి, మహారాష్ట్రకు చెందిన విద్యావేత్త కుమార్తెకు సువర్ణావకాశం లభించింది. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యావేత్త అశోక్‌ విఖే పాటిల్‌ కుమార్తె నీలా విఖేపాటిల్‌ స్వీడన్‌ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో రాజకీయ సలహాదారురాలిగా నియమితులయ్యారు. స్వీడన్‌లో ఇటీవల అధికారం చేపట్టిన సోషల్‌ డెమోక్రాట్‌ గ్రీన్‌ పార్టీ కూటమి నాయకుడు స్టీఫెన్‌ లోవన్‌ వద్ద  కొంతకాలంగా నీల పనిచేస్తున్నారు. స్టీఫన్‌ గత నెలలో స్వీడన్‌ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నీలను తన రాజకీయ సలహాదారురాలిగా నియమించుకున్నారు. ‘నీల... స్వీడన్‌ ప్రధాన మంత్రి రాజకీయ సలహాదారుగా నియమితులయ్యారు. ఆర్థిక విభాగం, పన్నులు, బడ్జెట్, గృహనిర్మాణం వంటి విభాగాల బాధ్యతలను కూడా నిర్వహిస్తారు’ అని ఆమె తండ్రి అశోక్‌ పాటిల్‌ చెప్పారు. 

అంతేకాకుండా తన కుమార్తె.. స్టాక్‌హోం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసీ) సిటీ కౌన్సిల్‌కు కూడా ఎన్నికయ్యారని చెప్పారు. నీల గత ప్రభుత్వం హయాంలోనూ రాజకీయ సలహాదారురాలిగా పనిచేశారు. ఆమె గ్రీన్‌ పార్టీలో క్రియాశీలకకార్యకర్త కూడా. అంతేకాకుండా గ్రీన్‌ పార్టీ ఎన్ని కల కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కాగా స్వీడన్‌లో జన్మించిన నీల బాల్యం అహ్మద్‌నగర్‌లోనే గడి చింది.  స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్‌ స్కూ ల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో నీల ఎంబీఏ డిగ్రీ చదివారు. నీల తాత బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌ గతంలో కేంద్ర మంత్రి గా పనిచేశారు. ఇక ఆమె మేనమామ రాధాకృష్ణ విఖేపాటిల్‌ మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top