చెరువులోకి విమానం

In New Zealand Plane Ditched Into Lagoon But Passengers Live - Sakshi

వెల్లింగ్టన్‌, న్యూజిలాండ్‌ : రన్‌ వే మీద ఆగాల్సిన విమానం కాస్తా అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దాంతో విమానంలో ఉన్న ప్రయాణికులు పడుతూ.. లేస్తూ.. ఈదుకుంటూ వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని మైక్రోనేషియన్‌ ద్వీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్‌ న్యుగిని విమానం స్థానిక వెనో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పింది. దాంతో ఒక్కసారిగా రన్‌వే పై నుంచి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. అయితే చెరువు లోతు తక్కువగా ఉండటంతో విమానం పూర్తిగా మునగలేదు.

ఈ లోపు ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే పడవలతో వెళ్లి ప్రయాణికులను, సిబ్బందిని కాపాడారు. కొందరు ప్రయాణికులు ఈత కొట్టుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు. కానీ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాణికులను, సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఘటనపై పపువా న్యూ గినియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top