ఆకట్టుకుంటున్న వాటర్ కేక్! | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న వాటర్ కేక్!

Published Wed, Apr 6 2016 11:00 PM

ఆకట్టుకుంటున్న వాటర్ కేక్!

న్యూయార్క్ః భోజన ప్రియులు ఇప్పటికే ఎన్నో రకాల కేక్ లను రుచి చూసి ఉంటారు. కానీ వాటర్ కేక్ ను ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడు నీటితో తయారయ్యే స్వచ్ఛమైన నీటి బిందువులా కనిపించే వాటర్ కేక్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటిదాకా గుడ్డుతోనూ, గుడ్డు లేకుండానూ కూడా కేక్ లు తయారు చేయడం చూశాం. ఇప్పుడా రోజులు పోయి ఏకంగా నీటితోనే చవులూరించే రుచికరమైన కేక్ లు కొన్ని దేశాల్లో తయారైపోతున్నాయ్...

స్వచ్ఛమైన నీటితో కేక్ ను తయారు చేయడం కొత్తగా కనుగొన్నారు న్యూయార్క్ వాసులు. ఈ కొత్త ప్రయోగానికి జనం ఆకర్షితులయ్యారంటే ఇక  వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో త్వరలో మంచినీటికి ఎద్దడి ఏర్పడక తప్పదేమో అంటున్నారు వినియోగదారులు. తాజాగా తయారైన వాటర్ కేక్ ఇప్పుడు న్యూయార్క్ లోని సామాజిక మీడియాలో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ గా వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. స్మార్గాస్ బర్గ్ లో ఈ సంవత్సరం అత్యంత  ఆదరణను చూరగొన్నఈ జపనీస్ డెజర్ట్ ను మిజు షింగెన్ మోచీగా పిలుస్తున్నారు. జపాన్ లోని కేక్ ల సృష్టికర్త.. డేరెన్ వాంగ్ సృష్టించిన ఈ స్ఫటికాకారంలో ఉన్ననీటి వంటకాన్ని(వాటర్ కేక్) న్యూయార్క్  కు తీసుకొచ్చి  రైన్ డ్రాప్ కేక్ గా మార్చారు.

మృదువుగా, ట్రాన్స్పరెంట్ జెల్లీలా కనిపించే వాటర్ కేక్ ను ముక్కలు ముక్కలుగా కూడ కోయచ్చు. అయితే దీన్ని కాస్త భద్రంగా కూడ నిల్వ ఉంచాల్సి వస్తుంది.  వేడి తగిలినా, ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా కరిగిపోతుంది. ఇప్పటికే పలు రకాల ఆహార పదార్థాలను సృష్టించి, తన ప్రయోగాలతో ఇన్ స్టాగ్రామ్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్న వాంగ్ కేవలం ఘనీభవించిన నీరు, జెలటిన్ తో ఈ కేక్ ను తయారు చేశారు. ఇలా తయారు చేసిన వాటర్ కేక్ పై  బ్రౌన్ సుగర్ సిరప్, వేయించిన సోయా పిండి చల్లి వడ్డిస్తున్నారు. జపాన్ లో వాటర్ కేక్ గా గుర్తింపు పొందిన ఈ కేక్ ఇప్పుడు న్యూయార్క్ ప్రజలకు రైన్ డ్రాప్ కేక్ గానూ పరిచయమై ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement