ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌ | New York Love Story Photoshoot Goes Viral | Sakshi
Sakshi News home page

ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌

Jul 30 2019 5:32 PM | Updated on Jul 30 2019 5:32 PM

New York Love Story Photoshoot Goes Viral - Sakshi

హిందూ, ముస్లిం యువతుల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

న్యూఢిల్లీ: ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసినవారంతా చాలా బావున్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాకిస్తాన్‌ దేశాలకు చెందిన ఇద్దరు యువతులతో న్యూయార్క్‌లో చేసిన ఈ ఫొటో షూట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం ఆర్టిస్ట్‌ సుందాస్ మాలిక్‌, భారత్‌కు చెందిన హిందూ యువతి అంజలి చక్రా ఈ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు.

న్యూయార్క్‌ బ్యాక్‌డ్రాప్‌లో చిరు జల్లులు పడుతుండగా పారదర్శక గొడుగులో ఈ ఇద్దరూ నవ్వుతూ, తుళ్లుతూ.. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ తన్మయత్వ అధర చుంబనంలో ఉన్నట్టుగా ఈ ఫొటోలు తీశారు. ‘ఏ న్యూయార్క్‌ లవ్‌ స్టోరీ’ పేరుతో ఫొటోగ్రాఫర్‌ సరోవర్‌ తన ట్విటర్‌ పేజీలో ఈ చిత్రాలను షేర్‌ చేశాడు. నెటిజనులను అమితంగా ఆకట్టుకోవడంతో సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. సుందాస్ మాలిక్‌ కూడా ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేశారు. ఫొటో షూట్‌ చాలా బాగుందని, హృదయానికి దగ్గర ఉందని చాలా మంది పాజిటివ్‌ కామెంట్లు పెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement