హెచ్‌–1బీ స్టూడెంట్‌ వీసాపై కొత్త నిబంధనలు | New rules on H-1B Student Visa | Sakshi
Sakshi News home page

హెచ్‌–1బీ స్టూడెంట్‌ వీసాపై కొత్త నిబంధనలు

Jun 2 2017 2:59 AM | Updated on Sep 26 2018 6:44 PM

హెచ్‌–1బీ స్టూడెంట్‌ వీసాపై కొత్త నిబంధనలు - Sakshi

హెచ్‌–1బీ స్టూడెంట్‌ వీసాపై కొత్త నిబంధనలు

అమెరికాలో మాస్టర్‌ డిగ్రీ, ఇతర ఉన్నత విద్యల్ని అభ్యసించిన విదేశీ విద్యార్థులకు జారీ చేసే హెచ్‌–1బీ వీసాలపై కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు.

వాషింగ్టన్‌: అమెరికాలో మాస్టర్‌ డిగ్రీ, ఇతర ఉన్నత విద్యల్ని అభ్యసించిన విదేశీ విద్యార్థులకు జారీ చేసే హెచ్‌–1బీ వీసాలపై కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. విద్యార్థులు డిగ్రీ తీసుకునే సమయానికి ఆ విద్యాసంస్థకు.. యునైటెడ్‌ స్టేట్స్‌ ఇన్‌స్టిట్యుషన్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ గుర్తింపు ఉంటేనే ‘స్టూడెంట్‌ హెచ్‌–1బీ’ వీసాకు అర్హుడని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగం(యూఎస్‌సీఐఎస్‌) స్పష్టం చేసింది.

ప్రతీ ఏడాది 65 వేల హెచ్‌–1బీ, అమెరికాలో ఉన్నత విద్య చదివిన వారికి అదనంగా 20 వేల హెచ్‌–1బీ వీసాలు జారీ చేస్తారు. కాలిఫోర్నియాకు చెందిన లీనా ఆర్‌ కామత్‌ తనకు  హెచ్‌–1బీ వీసా(అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారికిచ్చే) కేటగిరీలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేయగా... ఇమ్మిగ్రేషన్‌ విభాగం తిరస్కరించింది. డిగ్రీ తీసుకునే సమయానికి అతను చదివిన ఇంటర్నేషన్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీకి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ గుర్తింపు లేదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement