breaking news
New terms
-
మహిళల కోసం సూపర్ ఉమెన్ టర్మ్: ప్రయోజనాలెన్నో..
భారతదేశపు దిగ్గజ ప్రైవేట్ జీవిత బీమా కంపెనీల్లో ఒకటైన బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, మహిళల కోసం ప్రత్యేకంగా బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్ ఉమెన్ టర్మ్ (ఎస్‌డబ్ల్యూటీ)ని ఆవిష్కరించింది. ఇది సంప్రదాయ జీవిత బీమా పరిధికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, మహిళలకు మాత్రమే పరిమితమయ్యే క్రిటికల్ ఇల్నెస్కి సంబంధించిన బెనిఫిట్స్, ఆప్షనల్ చైల్డ్ కేర్ బెనిఫిట్, హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులు మొదలైన వాటితో ఆర్థిక భద్రతను అందిస్తుంది. తద్వారా మహిళలు, వారి కుటుంబాలకు సమగ్ర రక్షణ కల్పిస్తుంది.కుటుంబాల సంరక్షణలో మహిళలు కీలకపాత్ర పోషిస్తారు. కాబట్టి వారికి కూడా ఆర్థిక భద్రత పటిష్టంగా ఉండాలి. మహిళలు ఆర్థిక స్వతంత్రత సాధించడంలో బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ పాలసీ దన్నుగా ఉంటుంది. ఆర్థికంగా ఆత్మవిశ్వాసం, జీవితంలోని ప్రతి దశలోనూ స్థిరత్వం అందించడం ద్వారా వారు తమ జీవిత లక్ష్యాలను సాధించుకోవడంలో తోడ్పాటు అందిస్తుంది.ఈ ప్లాన్‌లో కీలకాంశాలుటర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా సమగ్ర ఆర్థిక భద్రత: మారుతున్న మహిళల పాత్ర, వారి విశిష్టమైన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా లైఫ్ అష్యూర్డ్ మరణానంతరం నామినీకి ఎస్‌డబ్ల్యూటీ ఏకమొత్తంగా క్లెయిమ్‌ను చెల్లిస్తుంది. తద్వారా పాలసీదారులపై ఆధారపడిన వారి భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అందిస్తుంది.క్రిటికల్ ఇల్నెస్ (సీఐ) భద్రత: సీఐ రైడర్‌తో, బ్రెస్ట్, సర్విక్స్, ఒవేరియన్ క్యాన్సర్లు వంటి మహిళల ప్రత్యేక ఆరోగ్య సమస్యలు సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు ఎస్‌డబ్ల్యూటీ కవరేజీ అందిస్తుంది. దీనితో వారు కీలకమైన పరిస్థితుల్లో ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా చికిత్సపై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది.చైల్డ్ కేర్ బెనిఫిట్: పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించి, ఈ ప్లాన్ ప్రత్యేకంగా ఆప్షనల్ చైల్డ్ కేర్ బెనిఫిట్ కూడా అందిస్తుంది. ఎస్డబ్ల్యూటీతో కలిపి దీన్ని ఆవిష్కరించడం ఇదే ప్రథమం. ఒకవేళ దురదృష్టకర ఘటన ఏదైనా జరిగినా, పిల్లల చదువుకు తోడ్పాటు లభించేలా ఇది నెలవారీగా స్థిరమైన ఆదాయాన్ని అందించగలదు.హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులు (హెచ్ఎంఎస్): ఆర్థిక భద్రత పరిధికి మించి సమగ్ర హెల్త్ చెకప్‌లు, ఓపీడీ కన్సల్టేషన్లు, ప్రెగ్నెన్సీ సంబంధ తోడ్పాటు, ఎమోషనల్ వెల్నెస్ ప్రోగ్రాంలు, న్యూట్రిషనిస్ట్ గైడెన్స్ మొదలైనవన్నీ కవర్ అయ్యేలా ఈ ప్లాన్ సమగ్రమైన హెచ్ఎంఎస్ను కాంప్లిమెంటరీగా అందిస్తోంది. మహిళల సంక్షేమం పట్ల కంపెనీకి గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.''నేటి మహిళలు తమ ఆరోగ్యం, పిల్లల సంక్షేమం, ఆర్థిక స్వేచ్చకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇవన్నీ ఒకే ప్లాన్‌లో అందించాలనే ఉద్దేశంతో బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్ ఉమెన్ టర్మ్‌ను ఆవిష్కరించాం. తమ వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకోవడంలో ముందుకు వెళ్లేలా మహిళలకు ఆర్థికంగా భరోసా లభించేలా సాధికారత కల్పించే విధంగా ఇది రూపొందించబడింది. మహిళల ఆరోగ్య సంరక్షణ అవసరాలు లేదా వారి పిల్లలు లేక ప్రియమైన వారి భవిష్యత్తు సంరక్షణ అవసరాలకు అనుగుణంగా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు'' అని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈవో తరుణ్ చుగ్ తెలిపారు. -
ఐదో రోజూ అదే జోరు
ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆర్బీఐ కొత్త నిబంధనలు రుణాలు తీసుకున్నవాళ్లకు కరోనా కల్లోల కాలంలో ఊరటనివ్వనున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 48 పైసలు పుంజుకొని 73.82కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 253 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 40 పాయింట్ల లాభంతో 39,113 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 11,559 పాయింట్ల వద్దకు చేరింది. వరుసగా ఐదో రోజూ ఈ సూచీలు లాభపడ్డాయి. షాంఘై సూచీ లాభాల్లో ముగియగా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. అందరి కళ్లూ పావెల్ ప్రసంగంపైననే.. జాక్సన్ హోల్ సింపోజియమ్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ చేసే గురువారం రాత్రి ప్రసంగంపైననే ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. ఆయన ప్రసంగంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ► ఈ ఏడాది డిసెంబర్ వరకూ స్టాంప్ డ్యూటీని 3 శాతం మేర తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో రియల్టీ షేర్లు దూసుకుపోయాయి. డీఎల్ఎఫ్ 10%, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, గోద్రేజ్ ప్రొపర్టీస్, ఓబెరాయ్ రియల్టీ, సన్‌టెక్ రియల్టీ తదితర షేర్లు 7% లాభపడ్డాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 7 శాతం లాభంతో రూ.605 వద్ద ముగిసింది. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్త నిబంధనలు
తణుకు అర్బన్: సర్కారు ఆస్పత్రుల్లో వైద్యులు ఎవరు.. సిబ్బంది ఎవరు.. ఏ వైద్యుడు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నారు.. ఎవరు లేరు.. ఏ రోగానికి ఎవరిని సంప్రదించాలి అనే వివరాలు ఇకపై సులభంగా తెలుసుకునే వీలు కలగనుంది. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు వైద్యవిధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు, సిబ్బందికి డ్రెస్కోడ్తోపాటు విధి విధానాలను ప్రకటించారు. ఈ నెల 1 నుంచి ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వైద్యశాఖ అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు ఆకుపచ్చ రంగు, ఉద్యోగులకు నీలం రంగు, టెక్నికల్ స్టాఫ్‌కు ఎరుపు రంగు, ఫోర్త్ క్లాస్ సిబ్బందికి పసుపు రంగు, మినిస్టీరియల్ సిబ్బందికి గోల్డెన్ పసుపు రంగుల్లో నేమ్ బోర్డులను అందజేశారు. మార్గదర్శకాలు ఇవే ♦ వైద్యుడి నుంచి సిబ్బంది వరకు యూనిఫాం వేసుకోవాల్సిందే. అంటే డ్రెస్ కోడ్ తప్పక పాటించాలి. ♦ తమ హోదా, పేరు తెలిపే నేమ్ బోర్డును డ్రెస్‌పై ఛాతీ ప్రదేశంలో అమర్చుకోవాలి. ♦ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాల్సిందే. ♦ వైద్యుడు అందుబాటులో ఉన్నారా లేరా అనేది ఇన్/అవుట్ బోర్డు ఆస్పత్రి ముఖద్వారంలో ఉండాలి. ♦ షిఫ్ట్‌ల ప్రకారం విధుల్లో ఉండే ఉద్యోగులు నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ఉండాలి. ♦ క్లాస్ ఫోర్ ఉద్యోగులు షిఫ్ట్‌లు కాకపోతే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండాలి. ♦ కాల్ డ్యూటీ విధులు నిర్వర్తించే వైద్యులు, నర్సులకు ఉదయం ఒక గంట ఆలస్యమైనా అనుమతి ఉంటుంది. ♦ ఉదయం 9.15 గంటలు దాటిన తరువాత విధులకు హాజరైన వైద్యులు, సిబ్బందికి సగం రోజు ఆబ్సెంట్ వేస్తారు. ♦ వరుసగా మూడు ఆబ్సెంట్లకు ఒక సీఎల్ (క్యాజువల్ లీవ్) పోతుంది. ప్రయోజనాలివే.. విధుల్లో ఉండాల్సి వైద్యులు తాపీగా రావడం, వచ్చి బయటకు వెళ్లడం వంటి కారణాలతో జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను రోగులు వైద్యసేవల కోసం వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. కొత్త మార్గదర్శకాల కారణంగా ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఏ సమయంలో రోగులు ఆస్పత్రికి వెళ్లినా వైద్యసేవలు అందుతాయి. వైద్యులు, ఉద్యోగులు యూనిఫాంలో ఉండి నేమ్‌బోర్డు ధరించడం వలన వారు ఎవరు అనే విషయం తెలుస్తుంది. ఇన్/అవుట్ బోర్డు ద్వారా ఏ డాక్టరు అందుబాటులో ఉన్నారనేది సులువుగా అర్ధమవుతుంది. సీసీ కెమెరాలు కలెక్టరేట్‌కు అనుసంధానం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో అందుబాటులో ఉండాలనే నిబంధన 80 శాతం మంది పాటించడంలేదనేది వైద్యాధికారుల ఆరోపణ. ఆయా ఆస్పత్రుల వైద్యాధికారులు సమయానికి రావాల్సి ఉందని హెచ్చరిస్తుంటే తమ సామాజిక వర్గాల నాయకులను వెంటబెట్టుకుని పోరాటం చేస్తున్నారని, ఈ కారణంగా వైద్యాధికారులు చూసీచూడనట్లు ఉండాల్సి వస్తోందనేది ప్రధాన విమర్శ. దీనికి చెక్ పెట్టేందుకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇప్పటికే ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను కలెక్టరేట్‌కు అనుసంధానం చేయించారు. బయోమెట్రిక్ హాజరు వేసి జారుకునే వారి వివరాలు సేకరించేందుకు ఆస్పత్రుల సీసీ పుటేజీలను కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఎవరు ఏంటి అనేది తెలుసుకుని నేరుగా పనిష్మెంట్ ఇవ్వనున్నట్టు సమాచారం. నిబంధనలు పాటించాల్సిందే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యశాఖలో, వైద్యవిధాన పరిషత్‌లో అమలులోకి తెచ్చిన నూతన నిబంధనలను వైద్యులు, సిబ్బంది పాటించాల్సిందే. అందరూ యూనిఫాం ధరించాలి. నేమ్ బోర్డు కనిపించేలా అమర్చుకోవాలి. సమయపాలన తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె.శంకరరావు, డీసీహెచ్ఎస్, ఏలూరు నిబంధనలు పాటించకపోతే చర్యలు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వైద్యశాఖలో వస్తున్న మార్పులను వైద్యులు, సిబ్బంది పాటించాలి. గతంలో మాదిరిగా వచ్చాం.. వెళ్లాం.. అంటే ఇక కుదరదు. డ్రెస్ కోడ్‌తోపాటు వైద్యసేవల్లో కూడా సమయపాలన అనుసరించాలి. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్ఓ, ఏలూరు -
హెచ్–1బీ స్టూడెంట్ వీసాపై కొత్త నిబంధనలు
-
హెచ్–1బీ స్టూడెంట్ వీసాపై కొత్త నిబంధనలు
వాషింగ్టన్: అమెరికాలో మాస్టర్ డిగ్రీ, ఇతర ఉన్నత విద్యల్ని అభ్యసించిన విదేశీ విద్యార్థులకు జారీ చేసే హెచ్–1బీ వీసాలపై కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. విద్యార్థులు డిగ్రీ తీసుకునే సమయానికి ఆ విద్యాసంస్థకు.. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యుషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంటేనే ‘స్టూడెంట్ హెచ్–1బీ’ వీసాకు అర్హుడని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం(యూఎస్సీఐఎస్) స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది 65 వేల హెచ్–1బీ, అమెరికాలో ఉన్నత విద్య చదివిన వారికి అదనంగా 20 వేల హెచ్–1బీ వీసాలు జారీ చేస్తారు. కాలిఫోర్నియాకు చెందిన లీనా ఆర్ కామత్ తనకు హెచ్–1బీ వీసా(అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారికిచ్చే) కేటగిరీలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేయగా... ఇమ్మిగ్రేషన్ విభాగం తిరస్కరించింది. డిగ్రీ తీసుకునే సమయానికి అతను చదివిన ఇంటర్నేషన్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి హయ్యర్ ఎడ్యుకేషన్ గుర్తింపు లేదని పేర్కొంది.