హాకింగ్ అంచనా నిజమే | New evidence supports Stephen Hawking's theory of shrinking black holes | Sakshi
Sakshi News home page

హాకింగ్ అంచనా నిజమే

Aug 18 2016 4:46 PM | Updated on Sep 4 2017 9:50 AM

స్టీఫెన్ హాకింగ్

స్టీఫెన్ హాకింగ్

కృష్ణ బిలల ప్రభావం నుంచి కొన్ని కణాలు తప్పించుకొని బయటికి పోతాయన్న ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంచనా నిజమని శాస్త్రవేత్తలు నిరూపించారు.

జెరూసలెం: కృష్ణ బిలల ప్రభావం నుంచి కొన్ని కణాలు తప్పించుకొని బయటికి పోతాయన్న ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంచనా నిజమని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త జఫ్ స్టెయిన్‌హ్యూర్ ప్రయోగశాలలో కృత్రిమ కృష్ణబిలాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. 1974లో హాకింగ్  కొన్ని కణాలు కృష్ణబిలం ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటినే ప్రస్తుతం హాకింగ్ రేడియేషన్ అని పిలుస్తున్నారు.

హ్యూర్ ప్రయోగం ప్రకారం ఒక కణం, దాని విరుద్ధ పదార్థాన్ని కృష్ణబిలం అంచువద్ద గమనించగా ఒక  జత కణాలను కృష్ణబిలం శోషించుకుంది. మరికొన్ని కణాలు కృష్ణబిలం నుంచి కొంత శక్తిని గ్ర హించి వెలుపలకి చేరుకున్నాయి. కృష్ణబిలాలు నెమ్మదిగా విస్తరించడానికి, కొన్ని సార్లు అదృశ్యం కావడానికి ఇదే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement