
‘పరీక్షలో పాస్ మార్కులు రాకపోతే దేవుడు సాయం చేస్తాడా? పోయి, చదువుకో పో..! ’ అని ఎవరైనా చెప్తే, ఇకపై ఈ ఫార్ములా చూపండి. ఎందుకంటే, ‘దేవుడు అంటే ఒక అతి పెద్ద మ్యాథమెటీషియన్ ’ అని రుజువు చేస్తూ, కేంబ్రిడ్జ్ మేధావి పాల్ డైరాక్ ఒక గణిత సూత్రంతో నిర్వచించారు. ఈ విశ్వం ఏదో యాదృచ్ఛికంగా రాలేదు. ప్రకృతిలోని ప్రతి సృష్టిని ఎవరో జాగ్రత్తగా డిజైన్ చేసి, సెట్ చేశారు. గణిత సూత్రాలతో ఆకాశాలు, నక్షత్రాలు, మన ప్రాణాలను కూడా ముందే లెక్కపెట్టేశారు.
అంతేకాదు, మనకున్న వెలుగు కూడా దేవుడిచ్చిందే అని గణిత సూత్రాలతో వివరించారు. అయితే, అందరు శాస్త్రవేత్తలూ ఇలాగే ఆలోచించరు. శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చివరిసారిగా రాసిన పుస్తకంలో, ‘దేవుడు అనేది ఒక నిర్వచనం మాత్రమే, సాక్ష్యం కాదు’ అని స్పష్టంగా చెప్పారు.
కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకరు గణితంతో దేవుని వెతుకుతుంటే, ఇంకొకరు అదే గణితంతో దేవుడే లేరని చెప్తున్నారు. అంతిమంగా చెప్పుకోవాల్సింది ఒక్కటే: దేవుడు ఉన్నాడా లేడా అన్నదానికంటే, ఆయన ఉంటే ఈ గణిత పరీక్షలో మనకు పాస్ మార్కులు ఇవ్వగలడా లేదా అన్నది పెద్ద ప్రశ్న!
(చదవండి: సాహసానికి అరవై ఏళ్లు)