
భయంకరమైన పాములతోనే కొన్ని కుందేళ్లు సరదా చెలగాటం ఆడుతున్నాయి. ఆశ్చర్యపోతున్నారా? ఫ్లోరిడా ఎవర్‌గ్లేడ్స్ అడవుల్లోని పాములు నగరంలోకి వచ్చి ఊరంతా విందు చేసుకుంటున్నాయి. వందలాది పెంపుడు జంతువులు, చిన్న చిన్న జీవులన్నీ వాటికి ఆహారమవుతుంటే, శాస్త్రవేత్తలు ఒక కొత్త ఉపాయం ఆలోచించారు. నిజమైన కుందేళ్లకు బదులు, రోబో కుందేళ్లను తయారు చేశారు.
అవి బయటకు చూస్తే బొమ్మలా ఉంటాయి, కానీ లోపల చిన్న చిన్న యంత్రాలు దాచబడి ఉంటాయి. ఇవి వేడి పీల్చి వదులుతాయి, కదులుతూ నిజమైన కుందేళ్లలాగా కనిపిస్తాయి. అంతేకాదు, వీటికి నిజమైన కుందేళ్ల వాసన కూడా వచ్చేలా రూపొందించారు. అంటే వాసన, రూపం, కదలిక మొత్తం కుందేలు మాదిరే! ఒక్కసారి పాము చూసిన వెంటనే ‘ఆహా.. నా విందు రెడీ!’ అనుకుని దూకేస్తుంది.
అలా పాములు బయటకురాగానే, వాటిని సులభంగా పట్టేస్తున్నారు. ఇలా శాస్త్రవేత్తలు పాముల మీద సరదా చెలగాటం ఆడుతుంటే, మోసపోయిన పాములను చూసిన మిగతావి మాత్రం ఇకపై కుందేళ్లను తినే ముందు ‘నిజమా? నకిలీనా?’ అని రెండు సార్లు ఆలోచిస్తూ అయోమయంలో పడుతున్నాయి.
(చదవండి: అతి పెద్ద మేథమెటీషియన్ దేవుడే!)