ఏలియన్స్ గుట్టువిప్పే టెలిస్కోప్ | Sakshi
Sakshi News home page

ఏలియన్స్ గుట్టువిప్పే టెలిస్కోప్

Published Sat, Feb 20 2016 3:13 PM

ఏలియన్స్ గుట్టువిప్పే టెలిస్కోప్

వాషింగ్టన్: మానవుడు సాంకేతికంగా ఎంత అభివృద్ధిని సాధిస్తున్నా ఇంకా విశ్వంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో సవాలు విసురుతూనే ఉన్నాయి. వాటిలో ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) గురించిన కథనాలు ఒకటి. అసలు గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా.. లేదా.. అన్న విషయం ఇప్పటికీ మిస్టరీనే. ఈ మిస్టరీని ఛేదించడానికి నాసా నడుంబిగించింది.

దీని కోసం హబుల్ టెలిస్కోప్ కంటే 100 రెట్లు అధిక సామర్థ్యం ఉన్న ‘ ది వైడ్ ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్’ ను (డబ్ల్యూఎఫ్‌ఐఆర్‌ఎస్‌టీ) రూపొందిస్తోంది. విశ్వంలోని అంతుపట్టని రహస్యాలను కళ్లకు కట్టినట్టు చూపించగలిగే సామర్థ్యం ఈ టెలిస్కోప్‌కు ఉన్నట్టు నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ జాన్ గ్రన్స్‌ఫీల్డ్ తెలిపారు. ఇది 2018లో అందుబాటులోకి రానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement