రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి.. | Minor on-ground accident between two planes in Singapore | Sakshi
Sakshi News home page

రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి..

Mar 30 2017 2:16 PM | Updated on Sep 5 2017 7:30 AM

రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి..

రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి..

సింగపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అతి సమీపంగా ఎదురెదురుగా వచ్చి చిన్న ప్రమాదానికి గురయ్యాయి.

సింగపూర్‌: సింగపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అతి సమీపంగా ఎదురెదురుగా వచ్చి చిన్న ప్రమాదానికి గురయ్యాయి. ఈ సంఘటనతో రెండు విమానాల్లోని వందల మంది ప్రయాణీకుల వణికిపోయారు. స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి చైనాలోని టియాంజిన్‌కు చాంగి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరాల్సి ఉంది.

అదే విమానాశ్రయంలో ఎమిరేట్స్‌కు చెందిన విమానం ఈకే 405 ఉంది. ఇది దుబాయ్‌కు చెందిన విమానం. ఈ రెండు విమానాలు ఎయిర్‌పోర్ట్‌లో ఒకదానికి ఒకటి అనూహ్యంగా ఎదురెదురు వచ్చిన క్రమంలో స్కూట్‌ విమానానికి చెందిన ఎడమ రెక్క స్వల్పంగా ఈకే 405కి తాకింది. ఈ సమయంలో ఈ రెండు విమానాల్లో 303మంది ప్రయాణీకులు, 11మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనను చాంగి ఎయిర్‌పోర్ట్‌ కూడా ధ్రువీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement