చంద్రుడి కో ఉల్కా దెబ్బ! | Meteorite crashes into Moon in largest lunar impact on record | Sakshi
Sakshi News home page

చంద్రుడి కో ఉల్కా దెబ్బ!

Feb 26 2014 1:33 AM | Updated on Oct 16 2018 4:56 PM

చంద్రుడి కో ఉల్కా దెబ్బ! - Sakshi

చంద్రుడి కో ఉల్కా దెబ్బ!

మన చందమామకు భారీ ఉల్కా దెబ్బ తగిలింది. కారు సైజు ఉన్న ఓ ఉల్క గంటకు 61 వేల కి.మీ. వేగంతో దూసుకొచ్చి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది.

మన చందమామకు భారీ ఉల్కా దెబ్బ తగిలింది. కారు సైజు ఉన్న ఓ ఉల్క గంటకు 61 వేల కి.మీ. వేగంతో దూసుకొచ్చి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో 8 సెకన్లపాటు భూమిపై నుంచి సైతం చిన్న చుక్కలా కనిపించేలా అత్యంత ప్రకాశం వెలువడింది. గతేడాది సెప్టెంబరు 11న జరిగిన ఈ పేలుడును స్పానిష్ ఖగోళ శాస్త్రవేత్త జోషే మారియో మాడీడో అప్పుడే వీడియో తీసినా.. అసలు విషయం నిర్ధారించుకునేందుకు, అంచనా వేసేందుకు ఇంత సమయం పట్టిందట. చంద్రుడిపై శాస్త్రవేత్తలు రికార్డు చేసిన ఉల్కాపాతాల్లోనే అతి భారీదైన ఈ పేలుడు వల్ల 15 టన్నుల టీఎన్‌టీ పేలుడుకు సమానమైన శక్తి వెలువడి ఉండవచ్చని, సుమారు 40 మీటర్ల గొయ్యి ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. చిత్రంలో చంద్రుడిపై ఉల్క పడిన ప్రదేశాన్ని, వెలుతురును(బాణం గుర్తు వద్ద) చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement