breaking news
lunar impact
-
ఆకాశంలో అద్భుతం.. మళ్లీ 'సూపర్ మూన్'.. ఎప్పుడంటే?
వాషింగ్టన్: ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ ఆషాడ పౌర్ణిమ రోజున చంద్రుడు.. భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. ఈ జులై 13న 'సూపర్మూన్' కనువిందు చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఈ అద్భుతాన్ని దర్శించుకోనున్నాయి. నిండు చంద్రుడిని బక్ సూపర్ మూన్, థండర్ మూన్, హేమూన్, మెడ్ మూన్ అని కూడా పిలుస్తారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకారం.. జులై 13న ఈ సూపర్ మూన్ కనిపించనుంది. మధ్యాహ్నం 2.38 గంటలకు ఆ అద్భుతం కనిపించనుందని నాసా తెలిపింది. అయితే.. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.08 గంటలకు అంటే జులై 14న కనిపించనుంది. ఇలా భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన నిండైన చంద్రుడిని మూడు రోజుల పాటు చూడొచ్చు. మంగళవారం తెల్లవారుజాము నుంచి శుక్రవారం తెల్లవారు వరకు కనువిందు చేయనుంది జాబిల్లి. సూపర్ మూన్ అంటే ఏమిటి? తన కక్షలో తిరుగుతున్న చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు నిండుగా, అతిపెద్దగా కనిపిస్తుంది. దానినే సూపర్మూన్గా పిలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ నొల్లే 1979లో ఈ సూపర్ మూన్ అనే పదాన్ని మొదటి సారి ఉపయోగించారు. ఒక ఏడాదిలో మూడు, నాలుగు సార్లు ఇలా సూపర్మూన్ ఏర్పడుతుంది. దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ భూమిని 27 రోజుల్లో చూట్టివస్తాడు చంద్రుడు. అలా అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు ఆ స్థానాన్ని పేరీజీ అంటారు. భూమి నుంచి 3,63,300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యంత దూరంలోని స్థానాన్నిఅపోజీగా పిలుస్తారు. అది 4,05,500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమికి అత్యంత సమీపానికి వచ్చినప్పుడు సాధారణం కంటే 17శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్రుడు. ఇలా సూపర్మూన్ ఏర్పడిన సమయంలో సముద్రం ఎక్కువగా ఆటుపోట్లకు గురవుతుంటుంది. గత నెల జూన్లో సంభవించిన సూపర్మూన్ను స్ట్రాబెరీ మూన్గా వ్యవహరించారు. ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర -
చంద్రుడి కో ఉల్కా దెబ్బ!
మన చందమామకు భారీ ఉల్కా దెబ్బ తగిలింది. కారు సైజు ఉన్న ఓ ఉల్క గంటకు 61 వేల కి.మీ. వేగంతో దూసుకొచ్చి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో 8 సెకన్లపాటు భూమిపై నుంచి సైతం చిన్న చుక్కలా కనిపించేలా అత్యంత ప్రకాశం వెలువడింది. గతేడాది సెప్టెంబరు 11న జరిగిన ఈ పేలుడును స్పానిష్ ఖగోళ శాస్త్రవేత్త జోషే మారియో మాడీడో అప్పుడే వీడియో తీసినా.. అసలు విషయం నిర్ధారించుకునేందుకు, అంచనా వేసేందుకు ఇంత సమయం పట్టిందట. చంద్రుడిపై శాస్త్రవేత్తలు రికార్డు చేసిన ఉల్కాపాతాల్లోనే అతి భారీదైన ఈ పేలుడు వల్ల 15 టన్నుల టీఎన్టీ పేలుడుకు సమానమైన శక్తి వెలువడి ఉండవచ్చని, సుమారు 40 మీటర్ల గొయ్యి ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. చిత్రంలో చంద్రుడిపై ఉల్క పడిన ప్రదేశాన్ని, వెలుతురును(బాణం గుర్తు వద్ద) చూడొచ్చు.