న్యూయార్క్‌ ఉగ్రదాడి : సంచలన విషయాలు

Manhattan terror attack : Suicide bomber identified as Akayed Ullah - Sakshi

పేలుడుకు యత్నించిన వ్యక్తి.. బంగ్లాదేశ్‌కు చెందిన అఖాయెద్‌ ఉల్లాగా గుర్తింపు

ఏడేళ్లుగా అమెరికాలోనే ఉంటోన్న ఉల్లా.. తాను పనిచేసే ఎలక్ట్రికల్‌ కంపెనీలోనే బాంబు తయారీ

బాంబు సరిగా పేలకపోవడంతో తప్పిన పెనువిషాదం

న్యూయార్క్‌ : అమెరికా ఆర్థిక రాజధానిలో ఉగ్రదాడి యత్నానికి సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. న్యూయార్క్‌ నగరంలో అత్యంత రద్దీగా ఉండే మాన్‌హట్టన్‌ ప్రాంతంలోని బస్‌ టెర్మినల్‌ వద్ద ఆత్మాహుతిదాడికి యత్నించిన వ్యక్తిని.. ఐసిస్‌ అనుకూలుడిగా గుర్తించినట్లు న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌(ఎన్‌వైపీడీ) వర్గాలు తెలిపాయి.

అతను బంగ్లాదేశ్‌కు చెందిన అఖాయెద్‌ ఉల్లా..
మాన్‌హట్టన్‌ 42వ వీధి, ఎనిమిదో అవెన్యూ బస్‌ టెర్మినల్‌ వద్ద పేలుడు అనంతరం ఒక వ్యక్తి గాయాలతో పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దగ్గరికి వెళ్లగా, అతని పొట్ట భాగంలో, వేసుకున్న జాకెట్‌లో వైర్లు ఉండటాన్ని గమనించారు. బాంబ్‌ స్క్వాడ్ సాయంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. ఉగ్రవాదిగా భావిస్తోన్న వ్యక్తిని అఖాయెద్‌ ఉల్లాగా గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఇతను.. గత ఏడేళ్లుగా అమెరికాలోనే నివసిస్తున్నట్లు తెలిసింది.

ఎలక్ట్రిక్‌ కంపెనీలో బాంబు తయారీ
ఎన్‌వైపీడీ వర్గాల కథనం ప్రకారం.. అఖాయెద్‌ ఉల్లా తాను పనిచేస్తోన్న ఎలక్ట్రిక్‌ కంపెనీలోనే బాంబును తయారుచేసినట్లు విచారణలో వెల్లడైంది. ఐసిస్‌ ప్రభావితుడైన ఉల్లా.. గుట్టుచప్పుడు కాకుండా పైప్‌ బాంబును తయారుచేసి.. రద్దీగా ఉండే చోట దానిని పేల్చడం ద్వారా కలకలం రేపాలని భావించాడు. పథకం ప్రకారం సోమవారం ఉదయమే జాకెట్‌ కుడి జేబులో బాంబును పెట్టుకుని బస్‌ టెర్మినల్‌ వద్దకు చేరుకున్నాడు. అయితే అనుకున్నవిధంగా బాంబును పేల్చడంలో ఉల్లా విఫలమయ్యాడు.  దీంతో స్వల్ప పేలుడు మాత్రమే సంభవించింది. ఉల్లా వేసుకున్న జాకెట్‌, దుస్తులు, పొట్టభాగంలో కుడివైపు స్వల్పంగా కాలిపోయాయి. ఈ ఘటనలో ఉల్లాతోపాటు మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  బాంబును సరిగా పేల్చలేకపోవడంతో    గాయాలతో పడి  పోలీసు వర్గాలు తెలిపాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top