అమెరికా ఎంబసీ వద్ద కాల్పుల కలకలం | Man detained in Turkey after firing shots outside US embassy | Sakshi
Sakshi News home page

అమెరికా ఎంబసీ వద్ద కాల్పుల కలకలం

Dec 20 2016 1:23 PM | Updated on Oct 2 2018 2:33 PM

అమెరికా ఎంబసీ వద్ద కాల్పుల కలకలం - Sakshi

అమెరికా ఎంబసీ వద్ద కాల్పుల కలకలం

అంకారలోని అమెరికా రాయబార కార్యాలయం ముందు ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. టర్కీలో రష్యా రాయబారి హత్యకు గురైన కొన్ని గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో అధికారులు షాక్‌ తిన్నారు.

అంకార: అంకారలోని అమెరికా రాయబార కార్యాలయం ముందు ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. టర్కీలో రష్యా రాయబారి హత్యకు గురైన కొన్ని గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో అధికారులు షాక్‌ తిన్నారు. నల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి రాయబార కార్యాలయం ముందుకు వచ్చి ఎనిమిది రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం ఎంబసీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు.

అయితే, అక్కడే ఉన్న గార్డులు చాలా ధైర్యంగా అతడిని నిలువరించి చేతిలోని గన్‌ లాక్కుని ఎలాంటి నష్టం లేకుండా చూశారు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవలేదు. అంకారాలోనే రష్యా రాయబారిని పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు వేదికపైనే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ షాక్‌ నుంచి తేరుకోకముందే మరో రాయబార కార్యాలయం లక్ష్యంగా దాడికి యత్నం జరగడాన్ని అక్కడి అధికారులు సీరియస్‌ గా తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement