ఫేస్‌బుక్‌తో దీర్ఘాయుష్షు | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌తో దీర్ఘాయుష్షు

Published Wed, Nov 2 2016 3:16 AM

ఫేస్‌బుక్‌తో దీర్ఘాయుష్షు - Sakshi

లాస్‌ఏంజెల్స్: ఫేస్‌బుక్ ద్వారా ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని తాజా పరిశోధనలో తేలింది. అయితే  అది నిజజీవితంలో సామాజిక బంధాలను మెరుగుపరిచినప్పుడు మాత్రమే సాధ్యమట. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డీగో పరిశోధకులు 1.2 కోట్ల మందిపై చేసిన ఈ పరిశోధన వివరాల  ప్రకారం.. ఫేస్‌బుక్  వినియోగదారుల్లో అధిక శాతం సామాజిక జీవితాన్ని మెరుగుపరచుకుంటున్నారు. 

ఫేస్‌బుక్ ఖాతా ఉన్నవారు.. లేనివారి కంటే ఎక్కువ కాలం బతుకుతున్నారు. అంతేకాకుండా సగటున ఒక ఫేస్‌బుక్ వినియోగదారుడు చనిపోవడానికి మామూలు వ్యక్తి కంటే 12 శాతం తక్కువ అవకాశముంది. ఫేస్‌బుక్‌లో ఎక్కువ ఫ్రెండ్ రిక్వెస్టులు అంగీకరించే వ్యక్తులు ఎక్కువ కాలం నివసిస్తున్నట్లు వారు తెలిపారు.

Advertisement
Advertisement