బ్రిటిష్‌ సంపన్నుడి ఇంటి విలువ రూ.2347 కోట్లు..!

London Most Expensive House With River In The Dining Room - Sakshi

స్వర్గం పేరు వినగానే మన కళ్లముందు ఎన్నెన్నో ఊహలు కదలాడుతుంటాయి. స్వర్గంలాంటి ఇంటిని నిర్మించుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే ఈ బ్రిటీష్‌ బిలినియర్‌ జాన్‌ కాడ్వెల్‌(69)కు కూడా. అందుకే స్వర్గాన్ని తలపించేలా తన కలల సౌధాన్ని లండన్‌లో నిర్మించుకున్నాడు. 43,000 చదరపు అడుగుల్లో  నిర్మించుకున్న ఇంట్లో ...స్విమ్మింగ్‌ ఫూల్‌ను తలపించే డైనింగ్‌ టెబుల్‌, నదిని తలపించేలా భోజనాల గదితో అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఇది లండన్‌లోనే అత్యంత ఖరీదైనా భవనం.

తొమ్మిది అంతస్తులతో నిర్మిస్తున్న ఈ ఇంట్లో 15 పడక గదులు, బాల్‌రూమ్‌, క్యాటరింగ్‌, హిడెన్‌ లిఫ్ట్‌, స్టాక్‌ పార్కింగ్‌తో పాటుగా 200 మందికి ఒకేసారి అతిథ్యం ఇవ్వొచ్చు. అలాగే.. వినోదం కోసం స్విమ్మింగ్‌ ఫూల్‌, జిమ్‌, సెలూన్‌, మీడియా రూం, గేమ్‌ రుంలు ఉన్నాయి. థాయ్‌ లాండ్‌ను తలపించేలా రంగు రంగుల చేపలతో ప్రవహిస్తున్న నదిలా ఉండే భోజనాల గదిలో నిరంతరం నీరు ప్రవహించడానికి వాటర్‌ రీసైకిల్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో అది అచ్చం నదిలో ఉండి భోజనం చేస్తున్న అనుభూతిస్తుంది. 

కాగా సుల్తాన్‌ బ్రూనై సోదరుడు ప్రిన్స్‌ జెఫ్రీ బొల్కియా నుంచి 81 మిలియన్‌ పౌండ్లకు దీన్ని జాన్‌ కాడ్వెల్‌ కొన్నట్లు సమాచారం. 250 మిలియన్ల పౌండ్లతో ఈ ఇంటిని నిర్మిస్తున్నట్లు సమాచారం. అంటే అక్షరాల రూ. 2347.9 కోట్లు. లండన్ మైఫేర్ ప్రాంతంలోని 18, 19 శతాబ్థం నాటి రెండు కట్టడాలను విలీనం చేసి ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top