జిమ్‌లోకి అనుకోని అతిధి

Leopard In CRPF Gym In Mumbai - Sakshi

సాక్షి, ముంబై : గోరేగావ్‌ ప్రాంతంలో చిరుతపులి కలకలం సృష్టించింది. ఆరే కాలనీలోని ఎస్‌ఆర్పీఎఫ్ క్యాంప్‌లోని జిమ్‌లోకి శనివారం రాత్రి ఓ చిరుత చొరబడింది. ఆదివారం ఉదయం జిమ్‌ తాళాలు తెరవటానికి వచ్చిన సిబ్బంది ఒకరు జిమ్‌ లోపల చిరుతపులి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే జిమ్‌ తలుపులు మూసేసి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చాడు. సంజయ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌, థానే ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు రెండు గంటలు శ్రమించి చిరుతను పట్టుకోగలిగారు.

అధికారులు మాట్లాడుతూ.. ఈ జిమ్‌ అటవి ప్రాంతానికి చాలా దగ్గర ఉండటంతో అడవి మృగాలు తరుచుగా అక్కడికి వస్తుంటాయన్నారు. బంధించిన చిరుతపులిని అధికారులు చిరుతపులుల సంరక్షణా కేంద్రానికి తరలించారు. త‍్వరలోనే దానిని అడవిలోకి వదిలి పెడతామని అధికారులు చెప్పారు. కాగా, జిమ్‌లో చిరుత.. వార్తతో జనం ఎక్కువ సంఖ్యలో జిమ్‌ దగ్గర గుమిగూడగా వారిని నిలువరించడానికి అధికారులు కష్టపడాల్సి వచ్చింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top