
బలూచిస్థాన్ : నైరుతి పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో సూఫీ టెంపుల్ టార్గెట్‌గా ఉగ్రవాది గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బ్లాస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఝల్ మగ్సీ టెంపుల్ ప్రాంగణంలో ఆత్మాహుతి దాడి జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. భక్తుడిలా ఆలయం వద్దకు వచ్చిన ఉగ్రవాదిని అనుమానం వచ్చిన పోలీసులు నిలువరించారు. దీంతో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 20 మంది గాయాలపాలైనట్లు ఓ అధికారి తెలిపారు.