లఖ్వీ మళ్లీ నిర్బంధంలోకి.. | Lakhvi arrested again .. | Sakshi
Sakshi News home page

లఖ్వీ మళ్లీ నిర్బంధంలోకి..

Mar 15 2015 1:54 AM | Updated on Sep 2 2017 10:51 PM

లఖ్వీ మళ్లీ నిర్బంధంలోకి..

లఖ్వీ మళ్లీ నిర్బంధంలోకి..

ముంబై దాడుల సూత్రధారి లష్కరే ఉగ్రవాది లఖ్వీని పాకిస్తాన్ ప్రభుత్వం తిరిగి నిర్బంధించింది.

ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే ఉగ్రవాది లఖ్వీని పాకిస్తాన్ ప్రభుత్వం తిరిగి నిర్బంధించింది. శాంతిభద్రతల చట్టం కింద జైలులో ఉన్న అతడిని విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశించడం తెలిసిందే. దీనిపై భారత్  నిరసన వ్యక్తం చేయడంతో... పాక్ తిరిగి నిర్బంధంలోకి తీసుకుంది. కోర్టు ఆదేశాలపై శనివారం లఖ్వీని విడుదల చేసిన వెంటనే తిరిగి శాంతి భద్రతల చట్టం కింద అదుపులోకి తీసుకుంది. మరో 30 రోజులు లఖ్వీని రావల్పిండి జైల్లోనే ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇదే చట్టం కింద ప్రభుత్వం లఖ్వీని రెండుసార్లు అదుపులోకి తీసుకోగా.. ఆ రెండు సార్లూ కోర్టులు నిర్బంధాన్ని తప్పుబట్టి విడుదల చేయాల్సిందిగా ఆదేశించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement