ప్రపంచంలో అత్యంత అందగత్తె ఎవరంటే..! | jennifer aniston becomes world's most beautiful lady of peoples magazine | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అత్యంత అందగత్తె ఎవరంటే..!

Apr 21 2016 3:11 PM | Updated on Sep 3 2017 10:26 PM

ప్రపంచంలో అత్యంత అందగత్తె ఎవరంటే..!

ప్రపంచంలో అత్యంత అందగత్తె ఎవరంటే..!

ఈ సంవత్సరం ప్రపంచంలో అత్యంత అందగత్తె కిరీటాన్ని పీపుల్స్ పత్రిక జెనిఫర్ ఆనిస్టన్‌ (47)కు కట్టబెట్టింది.

అందాన్ని ఆరాధించని వాళ్లు ఉండరు. అందాల రాణుల పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. మరి ప్రపంచంలోనే అత్యంత అందగత్తె ఎవరో.. అసలు టాప్ 100 స్థానాల్లో ఎవరెవరు ఉన్నారోననే విషయాలు ఆసక్తి కలిగిస్తాయి కదూ. సరిగ్గా ఇదే విషయమై అమెరికాలో ప్రఖ్యాత పీపుల్స్ పత్రిక ప్రతియేటా నిర్వహించే తన సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది.

ఈ సంవత్సరం ప్రపంచంలో అత్యంత అందగత్తె కిరీటాన్ని జెనిఫర్ ఆనిస్టన్‌ (47)కు కట్టబెట్టింది. ఈ టైటిల్ దక్కడం పట్ల తనకు చాలా ఆనందంగా ఉందని ఆనిస్టన్ చెప్పింది. ఆమె తర్వాతి స్థానాల్లో వరుసగా రీస్ విదర్‌స్పూన్, సోఫియా వెర్గారా, కీక్ పామర్, సెలెనా గోమెజ్ ఉన్నారు. 1990 నుంచి ఇలా వరుసగా అందగత్తెల జాబితాను పీపుల్ పత్రిక వెల్లడిస్తోంది. ఇంతకుముందు కూడా ఒకసారి జెనిఫర్ ఆనిస్టన్‌కు ఈ టైటిల్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement