హిందూ గుడికి భద్రతాధికారిగా ముస్లిం వ్యక్తి | Javed Khan - The India-Born Muslim Cop Who Keeps US Hindu Temple Safe | Sakshi
Sakshi News home page

హిందూ గుడికి భద్రతాధికారిగా ముస్లిం వ్యక్తి

Jul 25 2016 12:06 PM | Updated on Sep 4 2017 6:14 AM

హిందూ గుడికి భద్రతాధికారిగా ముస్లిం వ్యక్తి

హిందూ గుడికి భద్రతాధికారిగా ముస్లిం వ్యక్తి

అమెరికాలోని ఓ హిందూ దేవాలయ భద్రత సిబ్బంది ఇన్‌ఛార్జిగా ముస్లిం వ్యక్తిని నియమించారు.

వాషింగ్టన్: అమెరికాలోని ఓ హిందూ దేవాలయ భద్రత సిబ్బంది ఇన్‌ఛార్జిగా ముస్లిం వ్యక్తిని నియమించారు. భారత సంతతికి చెందిన జావీద్ ఖాన్ అమెరికాలోని  ఇండియనాలో పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జావిద్ స్వస్థలం భారత్‌లోని ముంబై నగరం. జావీద్ 2001 నుంచి ఇండియానా పట్టణంలో నివాసముంటున్నాడు.

ఇండియనాపోలీస్‌లోని ఈ గుడిని ప్రతిరోజూ వందల మంది భక్తులు సందర్శిస్తుంటారు. వారాంతాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. గుడికి భద్రత అధికారిగా నియమితుడైనందుకు జావీద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మనుషులంతా ఒక్కటే, మనమందరం దేవుడి పిల్లలం, దేవుడు ఒక్కడే.. కానీ అనేక రూపాల్లో ఉంటాడ’ని అన్నారు. జావీద్ తన కూతురిని ఒక తెలుగు వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం విశేషం. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement