ఐఎస్ఐఎస్ కొత్త ఆయుధం.. ఎయిడ్స్ బాంబ్ | Islamic State's new weapon 'AIDS Bomb' | Sakshi
Sakshi News home page

ఐఎస్ఐఎస్ కొత్త ఆయుధం.. ఎయిడ్స్ బాంబ్

Aug 21 2015 3:33 PM | Updated on Sep 3 2017 7:52 AM

ఐఎస్ఐఎస్ కొత్త ఆయుధం.. ఎయిడ్స్ బాంబ్

ఐఎస్ఐఎస్ కొత్త ఆయుధం.. ఎయిడ్స్ బాంబ్

సిరియా, ఇరాక్ దేశాలతో యుద్ధానికి తలపడుతూ మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఇపుడు మరో సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. ఎయిడ్స్ వైరస్ ఎక్కించిన సూసైడ్ బాంబర్లతో యుద్ధానికి సై అంటోంది.

ఇస్తాంబుల్: సిరియా, ఇరాక్ దేశాలతో యుద్ధానికి తలపడుతూ మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఇపుడు మరో సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. ఎయిడ్స్ వైరస్ ఎక్కించిన సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసి.. యుద్ధానికి సై అంటోంది.

కుర్దిష్ సిరియన్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఎయిడ్స్ బాంబుతో విరుచుకుపడేందుకు ఐఎస్ఐఎస్ ప్రణాళికలు రచించింది. ఈ నేపథ్యంలోనే ఎయిడ్స్ వైరస్ ఇంజెక్ట్ చేసిన 16 మంది ఉగ్రవాదులను సూసైడ్ బాంబర్లుగా తయారు చేసినట్టు సమాచారం. వైరస్ ఎక్కించి, అనంతరం వారు పాజిటివ్ అని నిర్ధారించుకున్న తర్వాతే వీరిని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. దీంతో తమ సైనిక దళాల్లో ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలకు ఇస్లామిక్ స్టేట్ ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా తేలితే వాళ్లను వాళ్లు కాల్చుకొని తీరాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement