
'ఆ పైలట్ ను బంధించాం'
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు సిరియాలోని డమాస్కస్ లో యుద్ధ విమానాన్ని కూల్చి వేసి పైలట్ ను బంధించినట్టు శుక్రవారం ప్రకటించారు.
శుక్రవారం డమాస్కస్ లో యుద్ధ విమానం ఎగురుతున్న సమయంలో ఉగ్రవాదులు దానిని కూల్చి వేశారు. పైలట్ ఆజామ్ ఇద్ ను ఉగ్రవాదులు బంధించారని సిరియా మానవ హక్కుల సంస్థ ధ్రువీకరించింది. గత కొద్ది రోజులుగా సిరియాలో ఉగ్రవాదులు యుద్ధ విమానాలను కూల్చివేస్తున్నారు.