సముద్రంలో కుప్పకూలిన విమానం

Indonesian Lion Air aircraft missing off Jakarta - Sakshi

జకార్తా: ఇండోనేషియా రాజధాని నుంచి బయలుదేరిన లయన్‌ ఎయర్‌లైన్స్‌కు చెందిన  విమానం కనిపించకుండా పోయింది.  జకార్తానుంచి సుమంత్రాకు  టేక్‌ ఆఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే  అదృశ్యమైం‍దని ఇండోనేషియా అధికారులు చెప్పారు. బోయింగ్ 737 గా భావిస్తున్న ఈ  విమానంలో  ఎంతమంది ప్రయాణీకులు ఉన్నది స్పష్టం కాలేదు. ఏం జరిగిందీ ఇంకా  తెలియలేదనీ గాలింపు, సహాయ కార్యక్రమాల ఆపరేషన్‌ ప్రారంభించినట్టు ఎయిర్‌లైన్‌ అధికారి ఒకరు తెలిపారు.

మరోవైపు ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బాంకా బెలిటంగ్ దీవులలో ప్రధాన నగరమైన పంకకల్ పినాంగ్‌కు బయలుదేరిన లయన్‌ జెట్‌ పాసింజర్‌( జేటీ-610)విమానం సముద్రంలో కూలిపోయినట్టుగా భావిస్తున్నారు. సుమారు 200పైగా ప్రయాణికులు ఉండొచ్చని అంచనా. సముద్రాన్ని దాటుతూ కూలిపోయిందని,  విమానం శకలాలు కనిపించాయన్న స్తానికుల కథనాల ఆధారంగా అక్కడ గాలింపు చర్యలు మొదలు పెట్టారు.  అటు నేషనల్‌  సెర్చ్‌ అండ్‌  రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి యూసఫ్ లతీఫ్  విమానం క్రాష్ అయిందని ధృవీకరించారు.    సుమారు 30-40 మీటర్ల లోతులోకి ఈ విమానం కుప్పకూలిందని  పేర్కొన్నారు. బాధితులకు చెందిన డ్రైవింగ్‌ లెసెన్స్‌, ఐడీ కార్డులతోపాటు కొన్ని వస్తువులు నీటిలో కొట్టుకు  వచ్చాయని ఆయన తెలిపారు. మొత్తం 188 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఒక పసిపాప, ఇద్దరు చిన్నపిల్లలు, 178 ప్రయాణికులతోపాటు ఇద్దరు పైలెట్లు, అయిదుగురు సిబ్బంది ఉన‍్నట్టు  తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

2013లో లయన్‌కు  చెందిన విమానం బాలి సముద్రంలో కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో  సిబ్బంది, ప్రయాణికులు  సురక్షితంగా బయటపడ్డారు.   2014లో ఇదే సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో  25మంది ప్రాణాలు కోల్పోయారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top