breaking news
Indonesian plane
-
సముద్రంలో కుప్పకూలిన విమానం
జకార్తా: ఇండోనేషియా రాజధాని నుంచి బయలుదేరిన లయన్ ఎయర్‌లైన్స్‌కు చెందిన విమానం కనిపించకుండా పోయింది. జకార్తానుంచి సుమంత్రాకు టేక్ ఆఫ్ తీసుకున్న కొద్దిసేపటికే అదృశ్యమైందని ఇండోనేషియా అధికారులు చెప్పారు. బోయింగ్ 737 గా భావిస్తున్న ఈ విమానంలో ఎంతమంది ప్రయాణీకులు ఉన్నది స్పష్టం కాలేదు. ఏం జరిగిందీ ఇంకా తెలియలేదనీ గాలింపు, సహాయ కార్యక్రమాల ఆపరేషన్ ప్రారంభించినట్టు ఎయిర్‌లైన్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బాంకా బెలిటంగ్ దీవులలో ప్రధాన నగరమైన పంకకల్ పినాంగ్‌కు బయలుదేరిన లయన్ జెట్ పాసింజర్( జేటీ-610)విమానం సముద్రంలో కూలిపోయినట్టుగా భావిస్తున్నారు. సుమారు 200పైగా ప్రయాణికులు ఉండొచ్చని అంచనా. సముద్రాన్ని దాటుతూ కూలిపోయిందని, విమానం శకలాలు కనిపించాయన్న స్తానికుల కథనాల ఆధారంగా అక్కడ గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అటు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి యూసఫ్ లతీఫ్ విమానం క్రాష్ అయిందని ధృవీకరించారు. సుమారు 30-40 మీటర్ల లోతులోకి ఈ విమానం కుప్పకూలిందని పేర్కొన్నారు. బాధితులకు చెందిన డ్రైవింగ్ లెసెన్స్, ఐడీ కార్డులతోపాటు కొన్ని వస్తువులు నీటిలో కొట్టుకు వచ్చాయని ఆయన తెలిపారు. మొత్తం 188 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఒక పసిపాప, ఇద్దరు చిన్నపిల్లలు, 178 ప్రయాణికులతోపాటు ఇద్దరు పైలెట్లు, అయిదుగురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 2013లో లయన్‌కు చెందిన విమానం బాలి సముద్రంలో కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 2014లో ఇదే సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో 25మంది ప్రాణాలు కోల్పోయారు. #JT610 The plane appears to have gone down somewhere in the red circle. We know from previous incidents out there that it is very hard to be certain of locations. pic.twitter.com/AepgJaRB9r — Mike Chillit (@MikeChillit) October 29, 2018 We're following reports that contact has been lost with Lion Air flight #JT610 shortly after takeoff from Jakarta. ADS-B data from the flight is available at https://t.co/zNM33cM0na pic.twitter.com/NIU7iuCcFu — Flightradar24 (@flightradar24) October 29, 2018 -
కూలిపోయిన విమానంలో రూ. 5 కోట్ల నగదు!
జకర్తా: ఇండోనేసియా రాజధాని జకర్తాలోని పుపువా ప్రాంతంలో ఆదివారం కూలిపోయిన ఇండోనేసియా విమానంలో రూ. 5 కోట్ల నగదు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నిధుల్లో 5 కోట్ల నగదును ఇండోనేసియా ప్రభుత్వం పెగునన్గాన్, బిన్టాంగ్ ప్రాంతంలో నిరుపేద ప్రజలకు పంపిణీ నిమిత్తం నలుగురు రక్షకదళ సిబ్బందితో విమానంలో తీసుకవెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయల్దేరిన ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొండను ఢీకొని కూలిపోయిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన 33 నిమిషాలకే విమానం ఎయిర్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో విమానంలో 54 మంది ఉన్నారు. వీరిలో 49 మంది ప్రయాణికులు, ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు శిశువులు ఉన్నారు. గల్లంతైన విమానం ఆచూకి తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన సహాయ బృందాలు కూలిన ప్రాంతాన్ని గుర్తించాయి. -
విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు
-
విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు
జకార్తా: ఇండోనేషియా మెడాన్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య బుధవారానికి 141కి చేరింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన రవాణ విమానం హెర్క్యూలస్ -3 మంగళవారం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే.. మెడాన్ నగరంలోని నివాస ప్రాంతాలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమాన ప్రయాణికులతోపాటు సిబ్బంది 113 మంది మరణించారు. అయితే ఈ విమానం నివాస భవనాలపై పడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.