బ్రిటన్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి

Indian Sikh's turban ripped outside UK parliament in 'racist' attack  - Sakshi

లండన్‌: రన్వీత్‌పాల్‌ సింగ్‌ అనే పర్యావరణ కార్యకర్తపై బ్రిటన్‌లో జాత్యహంకార దాడి జరిగింది. బ్రిటన్‌ పార్లమెంటు ఎదుట ‘ముస్లిం వెనక్కి వెళ్లు’ అని అరుచుకుంటూ వచ్చిన ఓ శ్వేత జాతీయుడు సింగ్‌ తలపాగాను లాగేందుకు ప్రయత్నించాడు. సింగ్‌ గట్టిగా ప్రతిఘటించడంతో దుండగుడు పారిపోయాడు. ఎకోసిక్‌ సంస్థకు దక్షిణాసియా ప్రాజెక్టు మేనేజర్‌గా ఉన్న రన్వీత్‌పాల్‌ సింగ్‌.. మార్చి 14న నిర్వహించనున్న ప్రపంచ సిక్కు పర్యావరణ దినోత్సవంపై బ్రిటిష్‌ సిక్కు ఎంపీ తన్‌ దేశీతో చర్చించేందుకు వెళ్లారు. పోర్ట్‌కల్లిస్‌ హౌస్‌ వద్ద సెక్యూరిటీ క్యూలో ఉండగా ఈ దాడి జరిగింది. ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని, దాడి చేసిన వ్యక్తిని పట్టుకుంటామని పోలీసులు చెప్పినట్లు ఆయన వివరించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top