అమెరికాలో భారత సంతతి డాక్టర్ అరెస్ట్ | Indian-Origin Doctor Arrested In US | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారత సంతతి డాక్టర్ అరెస్ట్

Jan 18 2016 10:04 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో భారత సంతతికి చెందిన సైకియాట్రిస్ట్.. డాక్టర్ నరేంద్ర నాగారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన వద్దకు వైద్యం కోసం వచ్చిన 36 మంది పేషెంట్లు ఇటీవల మృతి చెందారు.

వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన సైకియాట్రిస్ట్.. డాక్టర్ నరేంద్ర నాగారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్దకు వైద్యం కోసం వచ్చిన 36 మంది పేషెంట్లు ఇటీవలి కాలంలో మృతి చెందారు. అందులో 12 మంది కేవలం డాక్టర్ ఇచ్చిన ఓవర్ డోస్ మెడిసిన్ వల్లనే మృతి చెందారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెల్లడైంది. దీంతో అధికారులు ఆయన ఆఫీసు, ఇంటిపై దాడి చేసి వివరాలను సేకరించారు.

జొనెస్బొరోలో సైకియాట్రిస్ట్గా పనిచేస్తున్న నాగారెడ్డి తన పేషెంట్లకు సిఫారసు చేసిన మందుల్లో.. నిషిద్ధ ఔషధాలను అధిక మోతాదులో వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓపియేట్స్, బెంజోడియేజ్పైన్ ఔషధాలను మితిమీరిన మోతాదులో సిఫారసు చేయడం వలన గత కొంత కాలంగా పేషంట్ల మృతికి కారణమైనట్లు గుర్తించామని క్లేటన్ కౌంటీ పోలీసు అధికారి వెల్లడించారు. సైకియాట్రిస్ట్గా తన పరిధిలోకి రానటువంటి అంశాలకు సైతం ఆయన మందులిచ్చారనే ఆరోపణలున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement