పొరుగు నక్షత్రం చుట్టూ రెండు కొత్త గ్రహాలు | In the neighborhood of two new planets around the star | Sakshi
Sakshi News home page

పొరుగు నక్షత్రం చుట్టూ రెండు కొత్త గ్రహాలు

Jun 5 2014 12:22 AM | Updated on Sep 2 2017 8:19 AM

పొరుగు నక్షత్రం చుట్టూ రెండు కొత్త గ్రహాలు

పొరుగు నక్షత్రం చుట్టూ రెండు కొత్త గ్రహాలు

మన సౌరకుటుంబానికి పొరుగున 13 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కాప్టెన్స్ అనే పురాతన నక్షత్రం చుట్టూ రెండు గ్రహాలు తిరుగుతున్నాయట.

మన సౌరకుటుంబానికి పొరుగున 13 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కాప్టెన్స్ అనే పురాతన నక్షత్రం చుట్టూ రెండు గ్రహాలు తిరుగుతున్నాయట. వాటిలో ఓ గ్రహంపై జీవుల నివాసానికి అనుకూలమైన వాతావరణం ఉండవచ్చట. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన లా సిలా, హవాయిలోని కెక్, చిలీలోని మెగాలెన్ వేధశాలల్లోని స్పెక్ట్రోమీటర్ల ద్వారా శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. వీటికి కాప్టెన్స్ బీ, సీలుగా పేర్లుపెట్టారు. ఈ కాప్టెన్స్‌కు, దాని గ్రహాలకు పెద్ద చరిత్రే ఉందట.

ఇవి 1,150 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడి ఉంటాయట. 16,000 కాంతి సంవత్సరాల దూరంలోని ఓ మరుగుజ్జు గెలాక్సీలో ఇవి ఏర్పడగా.. ఆ గెలాక్సీని మన పాలపుంత లాగేసుకుందని అంటున్నారు. ఈ ఊహాచిత్రంలో.. కాప్టెన్స్ నక్షత్రం, గ్రహాలు, మరుగుజ్జు గెలాక్సీలోని నక్షత్రాలు మిల్కీవే వైపు రావడాన్ని చూడొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement