వెస్టిండీస్ దీవులకు పెను ముప్పు పొంచి ఉంది.
కింగ్‌స్టన్: వెస్టిండీస్ దీవులకు పెను ముప్పు పొంచి ఉంది. హరికేన్ మాథ్యూ తీవ్ర తుపాన్‌గా మారి కరీబియన్ సముద్రాన్ని దాటింది. రాబోయే రెండు రోజుల్లో ఇది జమైకాను తాకుతుందని భావిస్తున్నారు. 2007లో ఫెలిక్స్ తరువాత ఇదే అతిపెద్ద తుపాన్ అని యూఎస్ జాతీయ హరికేన్ కేంద్రం వెల్లడించింది. ఆదివారమే దీని ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుందని తెలిపింది.
మాథ్యూను తీవ్రంగా పరిగణిస్తున్నామని, అప్రమత్తంగా ఉన్నామని సంస్థ డైరెక్టర్ ఇవాన్ థామ్సన్ చెప్పారు. జమైకాలో అత్యవసర విపత్తు కేంద్రాలను సిద్ధం చేశారు. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధత చర్చించేందుకు ప్రధాని ఆండ్రూ హాల్నెస్ అత్యవసరంగా పార్లమెంటును సమావేశపరిచారు. ప్రజలు నిత్యవసర సరకులను నిల్వ చేసుకుంటున్నారు.