పిల్లలున్న తల్లి ఆయుష్షు 11 ఏళ్లు తగ్గుతుంది.

Having Kids May Cut Womens Lifespan By 11 Years - Sakshi

వాషింగ్‌టన్‌: పిల్లలకు జన్మనిస్తే ఆ స్త్రీ జీవితకాలం 11 సంవత్సరాలు తగ్గిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. పిల్లలు లేని మహిళలతో పొల్చిచూస్తే పిల్లలున్న మహిళ సాధారణ జీవితాకాలం కంటే 11 ఏళ్లు తక్కువగా ఉంటుందంటూ జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీ తాను చేసిన అధ్యయనాన్ని ఆదివారం వెల్లడించింది.

మానవ క్రోమోజోముల్లో ఉండే టెలోమేర్స్‌ సగటు జీవితకాలం.. పిల్లలున్న మహిళల్లో తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పరిశోధనలు ప్రాధమిక దశలో ఉన్నాయని, మరింత అధ్యయనం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని యూనివర్సిటీ రిసెర్చర్‌ జె పోలాక్‌ తెలిపారు. పిల్లలు పుట్టిన తర్వాత టెలోమేర్స్‌ పొడవు తగ్గిపోతుందా లేదా అన్న విషయాన్ని కూడా ఇంకా నిర్ధరించుకోవాల్సి ఉందని ఆమె చెప్పారు. క్రోమోజోమ్స్‌ పనితీరుకుతోడు పని ఒత్తిడి, సామాజిక స్థితిగతులు కూడా మహిళ ఆయుష్షుపై  ఏవిధమైన ప్రభావాన్ని చూపుతాయో పరిశోధనలు చేస్తున్నామన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top