స్త్రీలపై వేధింపులను సహించొద్దు | Harassment of women at work can't be tolerated: Ivanka Trump | Sakshi
Sakshi News home page

స్త్రీలపై వేధింపులను సహించొద్దు

Nov 4 2017 3:07 AM | Updated on Jul 23 2018 8:49 PM

Harassment of women at work can't be tolerated: Ivanka Trump - Sakshi

టోక్యో: జపాన్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ మహిళా సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంకా  శుక్రవారం మాట్లాడారు. మహిళలపై లైంగిక వేధింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరానివన్నారు. ‘పని ప్రదేశాల్లో స్త్రీలకు తగిన గౌరవం ఇవ్వడంలో  విఫలమవుతున్నాం. వీటిలో మహిళలకు లైంగిక వేధింపులు ప్రధానమైనవి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు’ అని ఆమె పేర్కొన్నారు. జపాన్‌లోని కొంత మంది ప్రముఖ మహిళల గురించి ఆమె తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. కుటుంబంతో గడిపేందుకు మహిళలకు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చిన జపాన్‌ ప్రధాని షింజో అబేను ఇవాంక ప్రశంసించారు. ఆర్థికవృద్ధిని సాధించడంలో మహిళల పాత్రను పెంచేలా అబే తీసుకొచ్చిన ‘వుమెనామిక్స్‌’ను పొగిడారు.

Advertisement
 
Advertisement
Advertisement