నా కేబినెట్‌లో సగం మహిళలే | Half of the women in my Cabinet | Sakshi
Sakshi News home page

నా కేబినెట్‌లో సగం మహిళలే

Apr 27 2016 1:18 AM | Updated on Sep 3 2017 10:49 PM

నా కేబినెట్‌లో సగం మహిళలే

నా కేబినెట్‌లో సగం మహిళలే

అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీచేస్తున్న హిల్లరీ క్లింటన్ తాను అధికారంలోకి వస్తే కేబినెట్‌లో సగం మహిళలే ఉంటారని అన్నారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీచేస్తున్న హిల్లరీ క్లింటన్ తాను అధికారంలోకి వస్తే కేబినెట్‌లో సగం మహిళలే ఉంటారని అన్నారు. అమెరికాలో 50 శాతం మంది మహిళలే ఉన్నారు, కనుక నా కేబినెట్‌లో కూడా 50 మంది మహిళలు ఉంటారని ఆమె ఎంఎస్‌ఎన్‌బీసీ టౌన్ హాల్‌లో చెప్పారు.

మేరీల్యాండ్, డెలావర్, పెన్సిల్వేనియా, కనెక్టికట్, రోడే ఐలాండ్ ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ ప్రచార మేనేజర్ జాన్ పోడేస్ట భారతీయ అమెరికన్ నీరా టాండెన్‌ను ఆమె కేబినెట్‌లో చూడాలని ఒక సందర్భంలో అన్నారు. నీరా ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగెస్‌లో పనిచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement