26మందిని కిడ్నాప్ చేసిన సాయుధులు | Gunmen kidnap 26 from Qatari hunting group in Iraq: officials | Sakshi
Sakshi News home page

26మందిని కిడ్నాప్ చేసిన సాయుధులు

Dec 16 2015 6:26 PM | Updated on Sep 3 2017 2:06 PM

గుర్తు తెలియని కొందరు సాయుధులు 26 మంది ఖతారి హంటింగ్ పార్టీకి చెందిన సభ్యులను కిడ్నాప్ చేశాడు. ఈ విషయాన్ని ఇరాక్ అధికారులు స్పష్టం చేశారు.

బాగ్దాద్: గుర్తు తెలియని కొందరు సాయుధులు 26 మంది ఖతారి హంటింగ్ పార్టీకి చెందిన సభ్యులను కిడ్నాప్ చేశాడు. ఈ విషయాన్ని ఇరాక్ అధికారులు స్పష్టం చేశారు. ఇలా విదేశాలకు చెందినవారు అక్కడ కిడ్నాప్కు గురికావడం గడిచిన మూడు నెలల్లో ఇది రెండోసారి. ముథానా ప్రావిన్స్లో బుధవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు చెప్పారు.

అయితే, వారు ఏ దేశాలకు చెందిన సభ్యులు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, కిడ్నాప్ చేసిన సాయుధుల వివరాలు కూడా ఇంకా తెలియరాలేదని అన్నారు. తెల్లవారు జామున అనూహ్యంగా చాలా ట్రక్కుల్లో ఆయుధాలతో వచ్చిన సాయుధులు ఖతారి హంటింగ్ సభ్యులను చేరుకొని వారిని ఎత్తుకెళ్లిపోయారని వివరించారు. ఈ సభ్యులకు రక్షణగా ఉన్న ఇద్దరు ఇరాక్ అధికారులను కూడా సాయుధులు కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. అయితే, దోహా మాత్రం ఈ విషయాన్ని ఇంకా ఆమోదించలేదు. కిడ్నాప్ చేసినవారి డిమాండ్లు ఏమిటనే విషయం ఇంకా తెలియరాలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement