అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఐదుగురి మృతి | gunman opens gun fire and committed suicide after | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఐదుగురి మృతి

Feb 27 2016 7:00 AM | Updated on Nov 6 2018 7:56 PM

అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఐదుగురి మృతి - Sakshi

అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఐదుగురి మృతి

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాన్సాస్ కాల్పులు జరిగి 24 గంటలు గడవకముందే వాషింగ్టన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు.

వాషింగ్టన్: అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఓ గన్ మెన్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. అయితే, వారిని కాల్చిన తర్వాత తాను కూడా గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి అమెరికాలోని కన్సాస్ స్టేట్ లో ఓ ఉద్యోగి ఫ్యాక్టరీలో కాల్పులకు పాల్పడిన ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే బెల్ఫేర్ లో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

రూరల్ వాషింగ్టన్ సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు.. అనంతరం ఆ దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడని హవర్స్ లాంగ్ స్టాండోఫ్ అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఓ బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బెల్ఫేర్ స్టేట్ అధికారులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement