గల్ఫ్‌ జాబ్స్‌ కోసం ఇది ఉండాల్సిందే..

Good Conduct Certificate Providing By BLS For Indian Job Seekers - Sakshi

దుబాయ్‌ : గల్ఫ్‌ దేశాలలో ఉద్యోగం కోసం అభ్యర్థులు మంచి ప్రవర్తన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. యూఏఈ ప్రభుత్వం గత నెలలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల్లో ఒకటైన పీసీసీ (పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌)కు సంబంధించిన వివరాల కోసం పాస్‌పోర్టు, వీసా సమస్యలను పరిష్కరించే సంస్థలు ఇండియన్‌ మిషన్‌, బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌కు ఉద్యోగార్థుల నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. అయితే ఈ పీసీసీ సర్టిఫికెట్‌ పొందడం చాలా తేలికని బీఎస్‌ఎల్‌ ఇంటర్నేషల్‌ సంస్థ అధికారులు తెలియజేస్తున్నారు. భారతీయ మిషన్‌, బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా వెలువడిన పీసీసీలను ఆమోదిస్తుందని కూడా తెలిపారు.

పీసీసీ పొందేందుకు ఇలా చేయాలి..
ముందుగా బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పీసీసీ ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, లేదా నేరుగా బీఎల్‌ఎస్‌ సెంటర్‌ నుంచి కూడా పొందవచ్చు, డౌన్‌లోడ్‌ చేసిన ఫారంతో పాటు జాబ్‌ ఆఫర్‌ లెటర్‌, కంపెనీ ట్రేడ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, వీసాల జిరాక్స్‌ కాపీలను నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలు జతచేసి సబ్మిట్‌ చేయాలి. తర్వాత ఇండియన్‌ ఎంబసీని సంప్రదించి ఆమోదం పొంది, మళ్లీ తిరిగి బీఎల్‌ఎస్‌ కార్యాలయంలో ఇవ్వాలి. ఇక్కడ ప్రాసెస్‌ జరగడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. సర్టిఫికెట్‌ సిద్ధమైతే దరఖాస్తుదారుడి మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top