బంగ్లాలో దుర్గాదేవి విగ్రహాల ధ్వంసం | Goddess Durga's Idols Vandalised in Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాలో దుర్గాదేవి విగ్రహాల ధ్వంసం

Sep 29 2016 11:49 AM | Updated on Sep 29 2018 5:55 PM

ఈశాన్య బంగ్లాదేశ్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేశారు.

ఢాకా: ఈశాన్య బంగ్లాదేశ్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఢాకాకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న హబీగంజ్‌ జిల్లాలోని ఫుతర్‌మతి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఘటన చోటుచేసుకుంది.

ముస్లింల ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతంలో ప్రతిమలు తయారుచేసే వారికి, స్థానికులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. ఘర్షణలో భాగంగా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు వారు భావిస్తున్నారు. కాగా ఘటనపై ఎలాంటి కేసు నమోదవలేదు. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement