‘గ్లాస్గో స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌’లో భారీ అగ్ని ప్రమాదం

glasgow School of Art building has been destroyed again . - Sakshi

లండన్‌: స్కాట్లాండ్‌కు చెందిన చారిత్రక గ్లాస్గో స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో స్కూల్‌ పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 20 ఫైరింజన్లు, 120 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు కృషిచేశారు. స్కూల్‌లో మొదలైన అగ్ని కీలలు వేగంగా క్యాంపస్‌ నైట్‌క్లబ్, ఓ2 ఏబీసీ అనే మ్యూజిక్‌ కేంద్రానికి కూడా వ్యాపించాయి. ఈ భవనానికి ప్రముఖ ఆర్కిటెక్ట్‌ చార్లెస్‌ రెన్ని మెకింతోష్‌ రూపకల్పన చేశారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top