ఫ్రాన్సులో కుప్పకూలిన జర్మన్ విమానం | german airbus crashes in french alps, 148 people onboard | Sakshi
Sakshi News home page

ఫ్రాన్సులో కుప్పకూలిన జర్మన్ విమానం

Mar 24 2015 4:40 PM | Updated on Sep 2 2017 11:19 PM

ఫ్రాన్సులో కుప్పకూలిన జర్మన్ విమానం

ఫ్రాన్సులో కుప్పకూలిన జర్మన్ విమానం

జర్మనీకి చెందిన ఎయిర్బస్ ఎ-320 విమానం ఫ్రాన్సులోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలింది. అందులో 148 మంది ప్రయాణికులతో పాటు 6 మంది సిబ్బంది కూడా ఉన్నారు.

జర్మనీకి చెందిన ఎయిర్బస్ ఎ-320 విమానం ఫ్రాన్సులోని దక్షిణ ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలింది. అందులో 142 మంది ప్రయాణికులతో పాటు 6 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ విషయాన్ని జర్మనీ పౌర విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. బార్సిలోనా నుంచి జర్మనీలోని డసెల్డార్ఫ్కు ఈ విమానం వెళ్తోంది. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం 3.30 గంటల సమయంలో సంభవించింది. ఇంజన్ లో లోపం లేదా మంట వల్ల విమానం కూలి ఉండొచ్చని చెబుతున్నారు.

లుఫ్తాన్స ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ జర్మన్వింగ్స్ విమానయాన సంస్థకు చెందిన జీడబ్ల్యుఐ18జి విమానంలో ఇద్దరు పైలట్లు, నలుగురు స్టివార్డులు ఉన్నట్లు తెలిపారు. అది ప్రస్తుతం రాడార్ పరిధిలో ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. ఈ విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ఏ ఒక్కరూ మిగిలే అవకాశం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ తెలిపారు. విమాన శిథిలాలు కొంతవరకు కనిపించినట్లు ఫ్రెంచి హోంశాఖ తెలిపింది.

 

Advertisement

పోల్

Advertisement