breaking news
german flight crashed
-
ఆపద సంకేతాలు లేవు-కారణాలు తెలియదు
పారిస్: ఫ్రాన్స్‌లో ప్రమాదానికి గురైన విమానం నుంచి సిబ్బంది ఎటువంటి ఆపద సంకేతాలు పంపలేదని పౌర విమానయాన అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు కూడా తెలియదని వారు చెప్పారు. ప్రమాదానికి గురైన విమానం ఎయిర్‌బస్ ఎ320 విమానం జర్మన్ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు అనుబంధ సంస్థ అయిన జర్మన్‌వింగ్స్‌కు చెందినది. స్పెయిన్ దేశంలోని తీర నగరం బార్సెలోనా నుంచి బయల్దేరిన ఈ విమానం జర్మనీలోని డ్యుసెల్డార్ఫ్ నగరానికి వెళ్లాల్సి ఉంది. అయితే మార్గ మధ్యలో ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల మధ్య గల బార్సెలోనెటె స్కీ రిసార్ట్ సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:30 -11.00 గంల మధ్యలో ఇదికూలిపోయింది. ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయని పౌర విమానయాన అధికారులు ప్రకటించారు. విమానం కూలినపుడు భారీ శబ్దం వినిపించిందని, ఆ సమయంలో ఆ ప్రాంతంలో స్కీయింగ్ చేస్తున్న ప్రత్యక్ష సాక్షి ఒకరు ఫ్రెంచ్ టెలివిజన్ చానల్‌తో చెప్పారు. ''విమానం కూలిపోవడానికి కారణాలేమిటనేది మాకు తెలియదు. కూలిన పరిస్థితులను బట్టి విమానంలోని 150 మందీ చనిపోయినట్లు అక్కడికి వెళ్లిన సిబ్బంది నిర్ధారించారు'' అని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి మాన్యుయెల్ వాల్స్ మీడియాకు చెప్పారు. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారిలో 67 మంది జర్మన్ వాసులు, 45 మంది స్పెయిన్ పౌరులు ఉన్నట్లు భావిస్తున్నారు. జర్మనీకి చెందిన 16 మంది స్కూలు విద్యార్థులు కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు. -
ఫ్రాన్సులో కుప్పకూలిన జర్మన్ విమానం
-
ఫ్రాన్సులో కుప్పకూలిన జర్మన్ విమానం
జర్మనీకి చెందిన ఎయిర్‌బస్ ఎ-320 విమానం ఫ్రాన్సులోని దక్షిణ ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలింది. అందులో 142 మంది ప్రయాణికులతో పాటు 6 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ విషయాన్ని జర్మనీ పౌర విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. బార్సిలోనా నుంచి జర్మనీలోని డసెల్డార్ఫ్కు ఈ విమానం వెళ్తోంది. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం 3.30 గంటల సమయంలో సంభవించింది. ఇంజన్ లో లోపం లేదా మంట వల్ల విమానం కూలి ఉండొచ్చని చెబుతున్నారు. లుఫ్తాన్స ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ జర్మన్వింగ్స్ విమానయాన సంస్థకు చెందిన జీడబ్ల్యుఐ18జి విమానంలో ఇద్దరు పైలట్లు, నలుగురు స్టివార్డులు ఉన్నట్లు తెలిపారు. అది ప్రస్తుతం రాడార్ పరిధిలో ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. ఈ విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ఏ ఒక్కరూ మిగిలే అవకాశం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ తెలిపారు. విమాన శిథిలాలు కొంతవరకు కనిపించినట్లు ఫ్రెంచి హోంశాఖ తెలిపింది.