అంతా లోపలే.. అంతలో బాంబు బెదిరింపు | French consulate in New York evacuated after bomb threat | Sakshi
Sakshi News home page

అంతా లోపలే.. అంతలో బాంబు బెదిరింపు

Apr 23 2017 9:06 AM | Updated on Sep 5 2017 9:31 AM

అంతా లోపలే.. అంతలో బాంబు బెదిరింపు

అంతా లోపలే.. అంతలో బాంబు బెదిరింపు

అమెరికాలో ఫ్రాన్స్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. బాంబు బెదిరింపు రావడంతో ఉన్నపలంగా అప్పటికప్పుడు ఎంబీసీని పూర్తిగా ఖాళీ చేయించారు.

న్యూయార్క్‌: అమెరికాలో ఫ్రాన్స్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. బాంబు బెదిరింపు రావడంతో ఉన్నపలంగా అప్పటికప్పుడు ఎంబీసీని పూర్తిగా ఖాళీ చేయించారు. అయితే, ఇది తాత్కాలికమేనని, క్లియరెన్స్‌ రాగానే తిరిగి ప్రారంభించామని కార్యాలయ అధికారులు తెలిపారు. త్వరలో ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం అమెరికాలోని ఫ్రాన్స్‌ వాసులు ఓటు నమోదుచేసుకుంటున్నారు. ఈ సమయంలోనే న్యూయార్క్‌లోని కాన్సులేట్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది.

ఒక అనుమానిత వాహనం కాన్సులేట్‌పైకి దాడి చేసేందుకు దూసుకొస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందడంతోనే ఖాళీ చేయించారని సమాచారం. ‘పదుల సంఖ్యలో రాయబార కార్యాలయంలో ఉన్నారు. వారందరినీ తనిఖీ చేయడంతోపాటు ఓ వాహనాన్ని చెక్‌ చేస్తుండగా అనుమానిం వచ్చింది. దీంతో అందరినీ అలర్ట్‌ చేశాం. దీంతో అప్పటికప్పుడు ఖాళీ చేసి తిరిగి గంట తర్వాత ప్రారంభించాం’ అని కాన్సుల్‌ జనరల్‌ అన్నే క్లైరీ లెజెండ్రీ చెప్పారు. న్యూయార్క్‌లో దాదాపు 28వేల మంది ఫ్రెంచ్‌ పౌరులు ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement