రాకెట్ దాడితోనే ఎంహెచ్17 పతనం.. | Enmity and Civilian Toll Rise in Ukraine as World’s Attention Is Diverted | Sakshi
Sakshi News home page

రాకెట్ దాడితోనే ఎంహెచ్17 పతనం..

Jul 29 2014 1:56 AM | Updated on Sep 2 2017 11:01 AM

రాకెట్ దాడితోనే ఎంహెచ్17 పతనం..

రాకెట్ దాడితోనే ఎంహెచ్17 పతనం..

ఉక్రెయిన్ తిరుగుబాటుదారుల అధీనంలోని ఉక్రెయిన్ తూర్పుప్రాంతంలో ఇటీవల మలేసియా విమానం కూలిపోవడానికి రాకెట్ ప్రయోగమే కారణమని ఉక్రెయిన్ పేర్కొంది.

కీవ్, లండన్: ఉక్రెయిన్ తిరుగుబాటుదారుల అధీనంలోని ఉక్రెయిన్ తూర్పుప్రాంతంలో ఇటీవల మలేసియా విమానం కూలిపోవడానికి రాకెట్ ప్రయోగమే కారణమని ఉక్రెయిన్ పేర్కొంది. రాకెట్ పేలుడుతో బయల్పడ్డ పదునైన శకలం బలంగా తాకడంతోనే విమానం కూలిపోయినట్టు బ్లాక్‌బాక్స్‌ల సమాచారం ద్వారా తేలిందని ఉక్రెయిన్ జాతీయ భద్రతా, రక్షణ మండలి ప్రతినిధి ఆంద్రీయ్ లిసెంకో సోమవారం ఈ విషయం చెప్పారు.

విమానానికి సంబంధించిన బ్లాక్‌బాక్స్‌లను రష్యా అనుకూల తిరుగుబాటువాదులు మలేసియా అధికారులకు అప్పగించిన తర్వాత, సదరు బ్లాక్‌బాక్స్‌ల డాటాపై విశ్లేషణ బ్రిటన్‌లో జరిగిందని లిసెంకో తెలిపారు. అయితే, విమాన పతనంపై ఉక్రెయిన్ అధికారి వెల్లడించిన తాజా సమాచారాన్ని నెదర్లాండ్స్ మాత్రం ధ్రువీకరించలేదు. విమానం కూలిన ప్రమాదంలో 193మంది నెదర్లాండ్స్ పౌరులు మర ణించిన సంగతి తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement