కూలిన విమానం : 11 మంది మృతి | Eleven people feared killed in Polish plane crash | Sakshi
Sakshi News home page

కూలిన విమానం : 11 మంది మృతి

Jul 6 2014 9:27 AM | Updated on Mar 10 2019 8:23 PM

దక్షిణ పోలాండ్ జెస్టిచోవా సమీపంలోని టప్లో పట్టణంలో ప్రైవేట్ విమానం కూలిపోయింది.

దక్షిణ పోలాండ్ జెస్టిచోవా సమీపంలోని టప్లో పట్టణంలో ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఆ ఘటనలో 11 మంది మరణించగా, ఒకరిని రక్షించినట్లు పోలాండ్ ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు.

 

విమానం కూలిన వెంటనే దాని నుంచి భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయని చెప్పారు. దాంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పివేసినట్లు చెప్పారు. శనివారం చోటు చేసుకున్న ఆ ఘటన పోలాండ్ రాజధాని వార్సాకు 207 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుందని వివరించారు. ప్రమాదానికి గురైన ఆ విమానం ప్రైవేట్ సంస్థ పేరాచూట్ స్కూల్ చెందినదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement