బాతుకు స్వయంవరం; ఆదివారం ముహూర్తం | Sakshi
Sakshi News home page

ఒంటరిగా ఉన్న ఆడ బాతుకు మగతోడు కావలెను

Published Sun, Dec 15 2019 11:54 AM

Duck Seeking Duck: Man Ad For Alone Bird - Sakshi

పలానా చదువుకున్న అమ్మాయికి తగిన వరుడు కావలెను అన్న ప్రకటనలు మనం రోజూ పేపర్లో చూస్తూనే ఉంటాం. కానీ ఓ చోట మాత్రం మరీ విడ్డూరంగా ఓ బాతుకు తోడు కావలెను అని ప్రకటించారు. దీనికి సంబంధించి బాతు యజమాని మారిస్‌ పోస్టర్లు అతికించాడు. తాను ఓ బాతును పెంచుకుంటుండగా దానితో కలిసి ఉండే సహచర బాతులు కొద్ది వారాల క్రితం మరణించాయి. దీంతో ఆ బాతు ఒంటరిగా మిగిలిపోయింది. దాని బాధను చూడలేని మారిస్‌ ఓ పథకం ఆలోచించాడు. ఒంటరిగా ఉంటున్న ఆడ బాతుకు వెంటనే ఓ తోడు అవసరమని భావించాడు. అందుకోసం బాతు బొమ్మ గీసి దానికి ఈడూజోడు సరిపోయే మగబాతు కావాలంటూ ఓ దుకాణంలో పోస్టర్‌ అతికించాడు. మీ దగ్గర మగబాతు ఉన్నట్లయితే వెంటనే సమాచారం అందించండి అంటూ తన అడ్రస్‌ కూడా అందులో పొందుపరిచాడు. ఈ స్వయంవరాన్ని ఆదివారం ఏర్పాటు చేస్తున్నానని తెలిపాడు. పైగా బాతులు చక్కగా కలిసిపోడానికి, కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. ఈ ప్రకటన తెలిసిన కొందరు వ్యక్తులు మా దగ్గరున్న బాతుల్లో ఒక్కటైనా నచ్చకపోతుందా అని ఆయన ఇంటి మెట్లు ఎక్కుతున్నారు.

 
Advertisement
 
Advertisement