ఫొటో షూట్‌ వద్దు: ట్రంప్‌ | Donald Trump Claims He Rejected 'Person of the Year', TIME Says He's Wrong | Sakshi
Sakshi News home page

ఫొటో షూట్‌ వద్దు: ట్రంప్‌

Nov 26 2017 3:02 AM | Updated on Aug 25 2018 7:52 PM

Donald Trump Claims He Rejected 'Person of the Year', TIME Says He's Wrong - Sakshi

వాషింగ్టన్‌: ప్రతిష్టాత్మక టైమ్స్‌ మ్యాగజైన్‌ అందించే పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రెండోసారి తనకు వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది అవార్డుల ప్రదానం కోసం ఫొటో షూట్‌తో పాటు ఇంటర్వ్యూ కావాలని టైమ్స్‌ కోరడంతో ట్రంప్‌ స్పందించారు.

‘గతేడాదిలాగే ఈ సారి కూ నేనే పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎన్నికయ్యే అవకాశముందని చెప్పేందుకు టైమ్స్‌ ప్రతినిధులు ఫోన్‌ చేశారు. అందుకోసం ఓ మేజర్‌ ఫొటో షూట్‌తో పాటు ఇంటర్వ్యూ కావాలన్నారు. ఇందుకు నేను వద్దని చెప్పా. ఏదేమైనా ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు. మరోవైపు పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఎంపికపై ట్రంప్‌ పొరపడుతున్నారని టైమ్స్‌ వ్యాఖ్యానించింది. విజేతను డిసెంబర్‌ 6న ప్రకటిస్తామని వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement